Governors Award: "గవర్నర్స్ అవార్డు"ల్లో భారతీయుల్ని గర్వపడేలా చేసిన రాజమౌళి SS Rajamouli)

Governors Award: హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే గవర్నర్స్ అవార్డుల వేడుకలకు రాజమౌళి (SS Rajamouli) హాజరయ్యారు.

దర్శక ధీరుడు  రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా సంచనలాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలతో పాటు 'ఆర్ఆర్ఆర్' సినిమాకు పలు అవార్డులు లభిస్తున్నాయి. దర్శకుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. గ్లోబల్ వేదికలపై రాజమౌళి కనిపిస్తూ భారతీయ సత్తా చాటుతున్నారు. 

హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే గవర్నర్స్ అవార్డుల వేడుకలకు రాజమౌళి హాజరయ్యారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగే గవర్నర్స్ అవార్డుల కార్యక్రమంలో దర్శక ధీరుడు తళుకుమన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవనాకి ముందు లాస్ ఏంజిల్స్‌లో గవర్నర్స్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పలువురు అంతర్జాతీయ సినిమా దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 

గవర్నర్స్ అవార్డుల వేడుకలో రాజమౌళి

భారతదేశం నుంచి గవర్నర్స్ అవార్డుల కార్యక్రమానికి రాజమౌళి  (SS Rajamouli) కి ఆహ్మానం అందింది. నవంబర్ 19 తేదీన జరిగిన ఈ వేడుకలకు రాజమౌళి హాజరయ్యారు. రాజమౌళి తన సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించి.. ప్రతీ భారతీయుడిని గర్వపడేలా చేశారు.  సూటుబూటులో కనిపించారు. సూపర్ స్టైలిష్‌గా కనిపించారు దర్శక ధీరుడు.

ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్‌కు ఎంపిక చేయకపోవడంపై జ్యూరీ సభ్యులపై పలువురు ప్రముఖులు విమర్మలు చేశారు. కానీ జనరల్ కేటగిరీలో మొత్తం 15 విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైంది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఇటీవల జపాన్ దేశంలో రిలీజ్ చేశారు. జపాన్‌లో ఆర్ఆర్ఆర్ కాసుల వర్షం కురిపిస్తుంది. 

Read More : RRR : "ఆర్ఆర్ఆర్" కొత్త రికార్డు - జపాన్ దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన రాజమౌళి సినిమా

 

You May Also Like These