Advertisement

Nithya Menen: కోలీవుడ్ ద‌ర్శ‌కుడి పెళ్లి ప్ర‌పోజ‌ల్ ను తిర‌స్క‌రించిన నిత్యా మీన‌న్!

Nithya Menen: సహజనటి అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ల‌లో ఈ జనరేషన్ కి ఒకరో ఇద్దరో మాత్రమే ఉన్నారు. వారిలో నిత్యా మీనన్ కూడా ఒకరు. నిత్యా మీనన్ పై ఇప్ప‌టివ‌ర‌కు చాలా రకాల రూమర్స్ వచ్చాయి. కానీ, ఆమె వ్యక్తిత్వం చాలా మంచిదని ఆమెతో పని చేసిన వారు ఇప్ప‌టికీ చెబుతుంటారు. కాకపోతే.. సినిమా కథల విషయంలో, పాత్రల విషయంలో ఆమె వైఖరి సరిగా ఉండదని టాక్ ఉంది. అయితే, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) న‌టించి మొత్తానికి భీమ్లా నాయక్ తో ఈ అమ్మడు భారీ విజయాన్ని అందుకుంది. 

తాజాగా భీమ్లానాయ‌క్ (Bheemla Nayak) సినిమా గురించి నిత్యా మీన‌న్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. నా అంతట నేను ఎవరి దగ్గరికి వెళ్లి అవకాశాల కోసం నిలబడను. ఆ పాత్ర కోసం నేను సరిపోతానని అనుకుంటే.. వారే నా దగ్గరికి వచ్చి అడుగుతారు. భీమ్లా నాయక్ కి కూడా అలానే అవకాశం వచ్చిందని వివ‌రించింది. 

అయితే, నాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ (Director Trivikram) ముందు నుంచే తెలుసు. ఆయన నన్ను ఒక రౌడి అమ్మాయిలా చూస్తారు. అందుకే సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నాకు అలాంటి పాత్రను డిజైన్ చేశాడు. ఇప్పుడు భీమ్లా నాయక్ లో కూడా అలానే రౌడీ అమ్మాయి లానే కనిపిస్తానని నిత్య మీనన్ చెప్పుకొచ్చింది. అసలైతే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో నిత్య పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ తెలుగులో నిత్య పాత్రను కొద్దిగా పొడిగించి.. కథలలో ప్రాధాన్యం ఉండేలా చేశారట. అందుకే ఈ పాత్రకు నిత్య ఒప్పుకున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే.. తాజాగా నిత్యా మీనన్ (Nithya Menen) పెళ్లి గురించి ఓ ఆస‌క్తిక‌ర‌ అప్ డేట్ తెలిసింది. ఆమె ప్రేమ కోసం ఓ దర్శకుడు తెగ ఉబలాట పడుతున్నాడట. నిత్యా మీనన్ క్యారెక్టర్ కి ఒక దర్శకుడు తెగ కనెక్ట్ అయిపోయాడట. నిత్యా మీనన్ కి అతను పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. కానీ నిత్యా మీనన్ మాత్రం అతని ప్రేమను సున్నితంగా తిరస్కరించిందట. అయినా నిత్యా మీనన్ ప్రేమాయణం గురించి గతంలోనే అనేక రూమర్స్ వచ్చాయి. ఒక తమిళ దర్శకుడితో ఆమె ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఫలానా తెలుగు హీరోతో ఆమె సన్నిహితంగా ఉంటుందని అన్నారు. 

ఈ లోపు ఓ మలయాళ సినిమా షూటింగ్ సమయంలోనే నిత్యా మీనన్ (Nithya Menen) మంచితనానికి మరో దర్శకుడు ఫిదా అయిపోయాడని, పెళ్లికి కూడా ఈ ఇద్దరు రెడీ అయ్యారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమా తర్వాత వీరిద్దరి బంధం కూడా ప్లాప్ గా ముగిసిందట. మొత్తానికి నిత్యా మీనన్ ప్రేమాయణం గురించి న్యూస్ సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా అనేక రకాలుగా న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. కాగా, నిత్యా మీన‌న్ ప్ర‌స్తుతం తెలుగు ఓటీటీలో ప్ర‌సార‌మ‌య్యే ఇండియ‌న్ ఐడ‌ల్ సింగింగ్ ప్రోగ్రాం జ‌డ్జిగా వ్య‌వ‌హరిస్తున్నారు. 

Readmore: Nithya Menen: హీరోయిన్ గా, జ‌డ్జిగా స‌త్తా చాటుతున్న టాలీవుడ్ బ్యూటీ నిత్యా మేనన్ !

Advertisement
You May Also Like These
Advertisement