Advertisement

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి తాజా చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’.. ప్రమోషన్లలో బిజీగా ఉన్న నటి!

Lavanya Tripathi: టాలీవుడ్ లో ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు తన అందంతో పాటు అభినయాన్ని చూపెట్టిన నటి లావణ్య త్రిపాఠి. ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో తాజాగా నటించిన  సినిమా 'హ్యాపీ బర్త్ డే'.  ఈ మూవీకి ‘మత్తు వదలరా’ ఫేమ్‌ రితేష్‌ రానా దర్శకత్వం వహించారు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై. సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు.

థ్రిల్లర్ ఎంటర్టైనర్ నేపథ్యంలో ఈ సినిమాలో వెన్నెల కిషోర్ (Vennela Kishore), కమెడియన్ సత్య, న‌రేష్ అగ‌స్త్య, స‌త్య‌, రాహుల్ రామ‌కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా, ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలకు అద్భుత స్పందన లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. లావణ్ త్రిపాఠి ఈ చిత్రం ద్వారా తన కెరీర్‌‌లో మొదటిసారి నాయికా ప్రాధాన్య చిత్రం చేస్తోంది. ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్రంలో కథ మొత్తం లావణ్య చుట్టూనే తిరుగుతుంది. కాగా, ఈ సినిమా విడుదల తేదీలో మార్పు జరిగింది. 

‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birth Day Movie) సినిమాను తొలుత జులై 15న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఓ వారం ముందుగానే అంటే జులై 8న రిలీజ్‌ చేయనున్నట్లు శనివారం చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తొలుత జూలై 15న ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లుగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ అనూహ్యంగా జూలై 8న రావాల్సిన నాగ‌చైత‌న్య థాంక్యూ సినిమా చివరి నిమిషంలో వాయిదా ప‌డింది. పెద్ద సినిమా వెన‌క్కి వెళ్లిపోవ‌డంతో ఆ డేట్‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భావించిన హ్యాపీ బ‌ర్త్ డే యూనిట్ వారం రోజుల ముందుగానే త‌మ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ది.

ఇక, ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించారు. కెమెరా: సురేష్‌ సారంగం, లైన్‌ ప్రాడ్యూసర్‌: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబా సాయి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ. కాగా, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నటించిన గత చిత్రం 'చావుకబురు చల్లగా'. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని చేసిన హ్యాపీ బర్త్ డే మూవీతో ఇప్పుడు ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.  

Read More: Lavanya Tripathi: జిమ్ వేర్ లో కుర్రాళ్ల మతి పోగొడుతున్న లావణ్య త్రిపాఠి, డింపుల్ హయాతి..!

Advertisement
You May Also Like These
Advertisement