శ్రీవిష్ణు (Sree Vishnu) ‘భళా తందనాన’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య​అతిథిగా రాజమౌళి

‘భళా తందనాన’ సినిమాలో శ్రీవిష్ణు (Sree Vishnu), కేథరిన్, గరుడ రామ్

శ్రీవిష్ణు (Sree Vishnu), కేథరిన్‌ జంటగా నటించిన సినిమా ‘భళా తందనాన’. వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. ఈనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘భళా తందనాన’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ మంగళవారం జరగబోతోంది.

శ్రీ విష్ణు (Sree Vishnu), కేథ‌రిన్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన ‘భ‌ళా తంద‌నాన’ మే 6న విడుద‌ల కానుంది. మరో రెండు రోజుల్లో సినిమా విడుదలవుతున్న క్రమంలో హైద‌రాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో మంగళవారం సాయంత్రం 7 గంట‌లకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్‌. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్‌‌ డైరెక్టర్‌‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు.

ఇక, ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌‌ను విశాఖపట్టణంలో చిత్ర యూనిట్‌ ఇటీవల విడుదల చేసింది. ట్రైలర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా కేథరిన్‌ ట్రెసా యాక్టింగ్‌, ఫోటోగ్రఫీ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి. మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అలరిస్తోంది. ఇక, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చేలా ఉంది. ఇప్పటివరకు చేయని కొత్త క్యారెక్టర్‌‌లో శ్రీవిష్ణు నటిస్తున్నాడు.

ట్రైలర్‌‌ విడుదల చేసిన తర్వాత దర్శకుడు దంతులూరి చైతన్య మాట్లాడుతూ.. వైజాగ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నా మొదటి సినిమాకు ఇక్కడే తీశాను. ప్రస్తుతం వేసవి సెలవులు. స్టూడెంట్స్ అందరూ  ఈ సినిమా చూడడానికి ప్లాన్ చేసుకోండి. కచ్చితంగా ‘భళా తందనాన’ సినిమా మంచి మెమొరీ ఇచ్చే చిత్రంగా మిగులుతుంది. జర్నలిస్ట్‌గా కేథరిన్‌ యాక్టింగ్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.

14 ఏళ్ల నుంచి చైతన్య నాకు ఫ్రెండ్: శ్రీ విష్ణు

‘వారాహి చలన చిత్రంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సుమారు 14 ఏళ్లుగా చైతన్య నాకు స్నేహితుడు. నా కెరీర్‌‌లో ‘భళా తందనాన’ సినిమా విభిన్నమైనది. రూ.2 వేల కోట్లు హవాలా స్కామ్‌ను ఎలా బయటపెట్టాం అనే దాన్ని ఆసక్తిగా చూపించాం. కేథరిన్‌కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. విలన్‌గా గరుడ రామ్‌ నటించారు. ఆయన యాక్టింగ్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుంది’ అని శ్రీవిష్ణు(Sree Vishnu) చెప్పాడు.  పోసాని కృష్ణమురళి, సత్య, శ్రీనివాస్‌ రెడ్డి, ఆదర్శ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.  

You May Also Like These