Singer KK : సింగ‌ర్ కేకే మృతికి ప్ర‌ధాని మోదీతో స‌హా.. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల సంతాపం !

కేకే (Singer KK) ఇక‌ లేర‌నే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్ర‌ధాని మోదీతో స‌హా ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. 

ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్  (Singer KK)  మ‌ర‌ణం భార‌తీయ సంగీత ప్ర‌పంచానికి తీర‌నిలోటు. కేకే గుండెపోటుతో క‌న్నుమూశారు. కోల్‌క‌తాలోని ఓ షోలో పాల్గొన్న‌ కేకే అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో హోటల్ రూంకు వెళ్లారు. హోట‌ల్ రూంలోనే కుప్ప‌కూలిపోయారు. అక్క‌డి నుంచి హాస్ప‌ట‌ల్‌కు తీసుకెళ్లారు. అప్ప‌టికే  కృష్ణకుమార్ కున్నత్ గుండె ఆగిపోయింది. కేకే ఇక‌లేర‌నే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్ర‌ధాని మోదీతో స‌హా ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. 

ఓం శాంతి అంటూ కేకే మ‌ర‌ణంపై సంతాపం తెలిపిన మోదీ

హిందీతో పాటు 11 భాష‌ల్లో పాట‌లు పాడిన పాపుల‌ర్ సింగ‌ర్ కృష్ణకుమార్ కున్నత్. కేకే  హ‌ఠాన్మ‌ర‌ణంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. కృష్ణ‌కుమార్ కున్న‌త్ మ‌ర‌ణం సంగీత ప్ర‌పంచానికి తీర‌ని లోట‌ని మోదీ తెలిపారు. కేకే కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. కేకే లాంటి ప్ర‌తిభ గల సింగ‌ర్స్ సినీ సంగీత ప్రపంచాన్ని, ఎంతో ఉన్న‌త స్థితికి తీసుకెళ్లారంటూ ఏఆర్ రెహ‌మాన్ కూడా ట్వీట్ చేశారు.

కేకే మ‌ర‌ణం షాక్‌కు గురిచేసిందన్న టాలీవుడ్ హీరోలు
చిరంజీవి, మ‌హేష్ బాబుతో ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు కేకే మ‌ర‌ణం ఓ విషాదం అంటూ సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. ఇంద్ర‌లో కేకే పాడిన‌ దాయి దాయి దామ్మ పాట ఎంతో హిట్ సాధించిందని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. కేకే గొప్ప సింగ‌ర్ అని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అన్నారు. కేకే మ‌ర‌ణం  షాక్‌కు గురిచేసిందని మ‌హేష్ తెలిపారు. కేకే  (Singer KK)  కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు.

బ‌రువెక్కిన గుండెతో కేకేకు నివాళి - రామ్ చ‌ర‌ణ్
కేకే పాట‌లు ఎప్ప‌టికీ త‌మ మ‌దిలో ఉంటాయ‌ని హీరో రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు. బ‌రువెక్కిన గుండెల‌తో కేకేకు నివాళి అంటూ రామ్ ఎమోష‌న‌ల్ అయ్యారు. కేకే ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నానంటూ రామ్ తెలిపారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో కేకే పాడిన పాట‌లు సూప‌ర్ డూప‌ర్ హిట్‌లుగా పాపుల‌ర్ అయ్యాయి. ఖుషీ సినిమాలో కేకే పాడిన ఏ మేరా జహాన్  సాంగ్ అప్ప‌ట్లో హిట్‌గా నిలిచింది. జ‌ల్సాలో మై హార్ట్ ఈజ్ బీటింగ్.. అదోలా పాట‌తో కేకే యువ‌త‌కు హుషారైన పాట‌ను అందించారు. బాలు సినిమాలో ఇంతే... ఇంతింతే సాంగ్, గుడుంబా శంకర్ సినిమాలో లే లే లే లే సాంగ్స్‌ ఇప్ప‌టికీ క్రేజ్ ఉన్న పాట‌లుగా మిగిలాయి.

గాయకుడు శ్రీ కె.కె. అకాల మరణం బాధాకరం - ప‌వ‌న్ క‌ల్యాణ్

సింగర్ కృష్ణకుమార్ కున్నత్ హఠాన్మరణం బాధ కలిగించిందని ప‌వ‌న్  కల్యాణ్ తెలిపారు. కేకే ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాన‌న్నారు. కేకే కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలన్నారు. సినీ సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యేక బాణీతో కెకె శ్రోతలను ఆకట్టుకున్నారని... ఆయన పాడిన పాటలు సంగీతాభిమానుల్లో సుస్థిరంగా నిలిచాయని అన్నారు. పవన్ కల్యాణ్ కేకే మ‌ర‌ణంపై ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

Read: చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ఆయనకు పాటే ప్రాణం.. గాయ‌కుడు కృష్ణకుమార్ కున్నత్ జీవితం ఆదర్శప్రాయం ! 

You May Also Like These