సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య ఏర్పడిన వివాదం ముదురుతోంది. ఇద్దరి మధ్యా మాటల యుద్ధం మొదలైంది. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి డేంజరస్ సినిమా రిలీజ్ కాకుండా కింద కోర్టులో స్టే తెచ్చాడని, తనను అవమానించేలా కామెంట్స్ చేశాడని వర్మ ఫైర్ అవుతూ కొద్దిసేపటి క్రితం ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. నట్టిపై పరువు నష్టం దావా వేయబోతున్నట్టు వెల్లడించారు. సినిమా రిలీజ్ కాకుండా స్టే తెచ్చి తనకు ఆర్థికంగా నష్టం కలిగించారని కూడా వర్మ తెలిపారు. ఇక, వర్మ చేసిన కామెంట్లకు నట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు.
‘‘ప్రతిసారీ కొత్త వాళ్లతో స్నేహం చేస్తున్నట్టుగా నటిస్తూ నువ్వు తీసే సినిమాలో పెట్టుబడి పెట్టించి, తరువాత వారిని మోసగించడం నీకు అలవాటేనని చాలా మందికి తెలియదు. నీ చేతిలో మోసపోయిన వాళ్లు విషయం బయటపెట్టకపోవడంతో ఇది నీకు అలవాటుగా మారింది. ఇటీవల నువ్వు తీసిన డేంజరస్ (మా ఇష్టం) సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్లాన్ చేశావు. ఈ అంశంపై కోర్టులో కేసు నడుస్తోంది. ప్రెస్‌నోట్ ద్వారా నువ్వు చేసిన ఆరోపణలను ఖండించకుంటే నీ చేతిలో మోసపోయిన మమ్మల్ని కూడా నీ గురించి తెలియని వాళ్లు తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ సమాధానం. నీ విషయాన్ని కోర్టులో లీగల్‌గా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా” అని నట్టి కుమార్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
Follow Us