Advertisement

Regina cassandra: రెజీనా ప్రధాన పాత్రలో అన్యాస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్.. ట్రైలర్ లాంఛ్!

Regina cassandra: ప్రస్తుతం ఓటీటీ వేదికగా వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతోంది. ఓటీటీ దిగ్గజ సంస్థలన్నీ సినిమాలకు ధీటుగా బలమైన కంటెంట్ తో వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో టాలీవుడ్ బ్యూటీ రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ కీలక పాత్రధారులుగా.. ఆర్కా మీడియా, ఆహా ఓటీటీ సంస్థలు నిర్మిస్తున్న వెబ్ సిరీస్ 'అన్యాస్ ట్యుటోరియల్' (Anyas Tutorial Trailer). ఈ వెబ్ సిరీస్ జులై 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ టీజర్‌ను రిలీజ్ చేయగా.. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ 7 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను జూలై 1 నుంచి ఆహా తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. 

రెజీనా (Regina cassandra), నివేదిత ఈసిరీస్ లో అక్కా చెల్లెల్లు గా నటించారు. సైబర్ టచ్ తో సాగే ఈ సిరీస్ లో హర్రర్ సన్నివేశాలు భయంకరంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. హార్రర్ చిత్రాల ప్రియులకు ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది అని అంటున్నారు. అక్కా చెల్లెళ్ళ మధ్య ఎం జరిగింది ? సైబర్ ప్రపంచం లోకి హర్రర్ ఎలా వచ్చింది అనే అంశాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.  

వెండితెరపై కుర్రకారు హృదయాలు దోచుకున్న భామ రెజీనా. టాలీవుడ్ లో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. రెజీనా చివరగా తెలుగులో సూపర్ హిట్ మూవీ ఎవరులో నటించింది. అడవి శేష్ (Adivi Shesh) హీరోగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. ప్రస్తుతం రెజీనా తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. 

Read More: My Dear Bootham: కొత్త అవతారంలో ప్రభుదేవా.. 'మై డియర్ భూతం' ఫస్ట్ లుక్ పోస్టర్!

Advertisement
You May Also Like These
Advertisement