పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ 'ఆదిపురుష్' (Adipurush) సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ సృష్టిస్తున్న అద్భుత చిత్రంగా 'ఆదిపురుష్'ను చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో 'ఆదిపురుష్' అప్‌డేట్స్ ఇవ్వాలంటూ, ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వెరైటీగా పోస్టులు పెడుతున్నారు. 'ఆదిపురుష్' అత్యంత ప్రతీష్టాత్మకంగా తెరకెక్కనున్న ఓ విజువల్ వండర్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బడా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ సినిమా కథ ఉండబోతోంది.. బడా హీరో, బడా డైరెక్టర్.. వీరితో పాటు పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న సెల్యులాయిడ్ మ్యాజిక్ 'ఆదిపురుష్'
ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' డిజాస్టర్ నుంచి బయటపడాలని చూస్తున్నారు. తమ అభిమాన హీరోకు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్టన్‌లో వస్తున్న 'సలార్' సినిమా నుంచి కూడా గతంలో ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
అయితే 'కేజీఎఫ్ చాప్టర్2' తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా తీస్తున్నారని, ఆయన అభిమానులు హ్యాపీగా ఉన్నారు. కానీ ఎన్ని రోజులైనా 'సలార్' అప్‌డేట్ రాకపోవడంతో కాస్త నిరాశ చెందారు. సలార్ సినిమా అప్‌డేట్స్ ఇవ్వాలంటూ ఏకంగా ఓ అభిమాని దర్శకుడికి సూసైడ్ లెటర్ కూడా రాశారు. ఆ లెటర్ ఎఫెక్ట్.. లేదా ఇంకేదేనా కారణమో గానీ.. 'సలార్' సినిమా అప్‌డేట్స్ రిలీజ్ అవుతున్నాయి.
ఇక 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ (Om Raut) ను కూడా ప్రభాస్ ఫ్యాన్స్ వదలడం లేదు. సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలని ఆయనను కోరుతున్నారు. అందుకే, ఈసారి కాస్త వెరైటీగా ప్రభాస్ ఫ్యాన్స్ ప్లాన్ చేశారు. రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 'ఓం రౌత్ అన్నా.. ఆదిపురుష్ అప్‌డేట్స్ ఇవ్వన్నా' అంటూ పోస్టరులు తయారుచేసి వదులుతున్నారు.
ఈ సంవత్సరం శ్రీ రామ నవమికి రాముడి వేషంలో ప్రభాస్‌ను చూడొచ్చని ఫ్యాన్స్ ఆశ పడ్డారు. కానీ 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ వస్తుందంటూ ఊరించి.. ఫ్యాన్ మేడ్ పోస్టర్‌తో సరిపెట్టారని ఇప్పటికే అభిమానులు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో 'ఆదిపురుష్' చిత్రాన్ని 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటన చేశారు. అంటే మరో ఎనిమిది నెలల్లో. సినిమా రిలీజ్ కానుంది. కానీ అప్‌డేట్స్ లేవని, ఫస్ట్ లుక్ ఎందుకు విడుదల చేయలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
రాముడిగా ఎనిమిది అడుగుల ఎత్తులో ప్రభాస్ ఆదిపురుష్ (Adipurush) రూపంలో కనిపిస్తారట. ఈ సినిమాలో సీత పాత్ర కోసం బాలీవుడ్ భామ కృతి సనన్‌ను ఎంపిక చేశారు. రామాయణంలో విలన్ రావణుడైతే.. 'ఆదిపురుష్'లో ఆ రోల్ సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. 3డీ చిత్రంగా 'ఆదిపురుష్' ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఈ చిత్రం కోసం వాడారు. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యకాలంలో 'ఆదిపురుష్' అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. మరి, ఓం రౌత్ కూడా ప్రశాంత్ నీల్‌లానే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అప్‌డేట్స్ అందిస్తారా లేదా? అన్నది చూడాలి.
Follow Us