Seerat Kapoor: ఓపికగా ఉండడం నేర్చుకున్నా: సీరత్‌ కపూర్‌‌

దిల్‌ రాజు సినిమాలో సీరత్‌ కపూర్‌‌

రన్‌ రాజా రన్, రాజు గారి గది–2, టచ్‌ చేసి చూడు, కృష్ణ అండ్‌ హిజ్‌ లీల చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బ్యూటీ సీరత్ కపూర్. అయితే ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు ఈ ముంబై భామకు. గ్లామర్‌‌తో కుర్రకారు గుండెల్లో చోటు సంపాదించుకున్న సీరత్‌ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రణ్‌వీర్ కపూర్‌‌ నటించిన రాక్‌స్టార్ చిత్రానికి అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌‌గా వర్క్‌ చేసి మంచి మార్కులే కొట్టేసింది.

అయితే ప్రస్తుతం సీనియర్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్న సినిమాలో అవకాశం దక్కించుకున్న సీరత్.. ఓపిగ్గా ఉంటే ఇండస్ట్రీలో అవకాశాలు వాటంతట అవే వస్తాయని అంటోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం, సైజ్‌ జీరోలోకి మారినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలో మొదలు కాబోయే రెండో షెడ్యూల్‌ కోసం కూడా బాగానే కసరత్తులు చేస్తోందని సినీ వర్గాల సమాచారం.

దిల్‌ రాజు నిర్మిస్తున్న సినిమాలో తన రోల్‌ గురించి, ప్రస్తుతానికి ఏ వివరాలు చెప్పలేనని తేల్చేసింది సీరత్‌ కపూర్. తన అభిమానులు ఏ పాత్రలో చూడాలని చాలా రోజులుగా కోరుకుంటున్నారో, అటువంటి రోల్‌ ఈ సినిమాలో చేస్తున్నట్టు తెలిపింది. ఇన్ని సంవత్సరాల తన కెరీర్‌‌లో  ఓపికగా ఉంటడడం నేర్చుకున్నానని చెప్పింది సీరత్.

Credits: Twitter
You May Also Like These