Advertisement

Macherla Niyojakavargam: "రారా రెడ్డి" సాంగ్‌ రిలీజ్ కార్యక్రమంలో సందడి చేసిన నితిన్, అంజలి, కృతి శెట్టి..!

Macherla Niyojakavargam: తెలుగు తెర మీద స్పెషల్‌ సాంగ్స్ ఎప్పటి నుంచో ఉన్నా.. ఇటీవలి కాలంలో మరోసారి ఈ ట్రెండ్‌ హాట్ టాపిక్ అవుతోంది. ఆ మధ్య అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' అంటూ సిల్వర్‌ స్క్రీన్ ను మాత్రమే కాదు సోషల్ మీడియాను కూడా షేక్ చేసేశారు స్టార్ హీరోయిన్‌ సమంత (Samantha). ఈ నేపథ్యంలో మాస్ సినిమాలకు మరింత హైప్ రావాలంటే స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయ్యారు మేకర్స్.

ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన 'రా.. రా.. రెడ్డి' అంటూ సాగే మాస్ ఐటెం సాంగే వినిపిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Hero Nithiin) నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సినిమా పేరులోనే ఓ కొత్త హైప్ తీసుకొచ్చారు డైరెక్టర్. ఈ సినిమాతోనే రాజ‌శేఖ‌ర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాలో నితిన్ పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి (Krithi Shetty).. అందాల తార కేథరిన్‌ థ్రెస్సా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మాచర్ల నియోజికవర్గం (Macherla Niyojakavargam) సినిమాలోనూ ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంది. గతంలో సింగం సినిమాలో ఐటమ్ సాంగ్‌ చేసిన అంజలి.. నితిన్ సినిమాలోనూ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడారు. రా రా రెడ్డి.. ఐయామ్ రెడీ అంటూ సినిమా మీద మాస్ ఆడియన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ పాటలో తెలుగు అమ్మాయి అంజలి స్టెప్స్ యమ హాట్ గా ఉన్నాయి.

అంజలి ఈ రేంజ్ అందాలను మనం ఇది వరకు చూసి ఉండం. అలా హాట్ గా కుర్రాళ్ళకు లంగా, జాకెట్ తో కిక్కెక్కిస్తోంది అంజలి. ఇటీవల ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ టీమ్ పాల్గొంది. నితిన్ నటించిన 'జయం' (Jayam Movie) సినిమాలోని రాను రాను అంటూనే పాట పల్లవి.. ఈ పాటకు యాడ్ చేయడం హైప్‌ను క్రియేట్ చేసింది.

ఇకపోతే అంజలి (Heroine Anjali) కాలికి గాయమయినా కూడా ఈ సాంగ్ షూటింగ్‌లో పాల్గొందని నితిన్ బయటపెట్టాడు. అలాంటి సమయంలో కూడా తను ఫ్లోర్ మూమెంట్స్ చేస్తూ చాలా కష్టపడిందని అన్నాడు. కాగా, 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమా నుంచి విడుద‌లైన రా..రా..రెడ్డి సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. హీరోయిన్ అంజ‌లి గతంలో కూడా 'సరైనోడు' సినిమాలో 'బ్లాక్ బస్టర్' పేరిట ఓ స్పెషల్ సాంగ్ చేశారట. ప్రస్తుతం టాప్ కథానాయికలు అందరూ ఐటం సాంగ్స్ బాట పట్టడం గమనార్హం.

Read More: Nithiin : నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలోని "రారా రెడ్డి" సాంగ్‌ అదుర్స్.. ఈ గీతం ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisement
You May Also Like These
Advertisement