నయనతార వెడ్డింగ్ పార్టీకి హాజరైన విలేకరులు
నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్‌లు భార్యభర్తలుగా కొత్త జీవితం ప్రారంభించారు. తమిళనాడులోని మహాబలిపురంలో జూన్ 9న నయన్, విఘ్నేష్‌ల వివాహం జరిగింది. వీరి పెళ్లికి బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌తో పాటు, సూపర్ స్టార్ రజనీకాంత్, నిర్మాత బోని కపూర్ వంటి సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. నయన్, విఘ్నేష్‌లు తమ పెళ్లి తర్వాత, ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే క్రమంలో శనివారం మీడియా మిత్రులకు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారు.
పెళ్లి వేడుక తర్వాత.. మీడియాకు వెడ్డింగ్ పార్టీ
తమ పెళ్లి తర్వాత జూన్ 11న మీడియాకు పార్టీ ఇస్తామని విఘ్నేష్ తాజాగా ప్రెస్‌మీట్‌లో చెప్పారు. చెప్పినట్టుగానే మీడియా మిత్రులకు గ్రాండ్ లంచ్ పార్టీ ఏర్పాటు చేశారు. మీడియా వారికి కలిసేందుకు నయన్ (Nayanthara), విఘ్నేష్‌లు జంటగా వచ్చారు. నయనతార పసుపు రంగు చీరలో మెరిసిపోయారు.
నుదుట సింధూరం, కాలికి మెట్టెలు, మెడలో పసుపు తాళితో కొత్త పెళ్లికూతురిగా నయన్ కళ కళ లాడారు. అలాగే, మీడియా అడిగే ప్రశ్నలకు నయన్ సిగ్గూ పడుతూ సమాధానం ఇచ్చారు. తాము ఇచ్చిన విందు ఎలా ఉందంటూ మీడియాను, ఈ జంట అడిగి మరీ తెలుసుకున్నారు. 'నయనతార చాలా సంతోషంగా ఉన్నారు. నయన్ సంతోషం తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది' అనే విషయం ఆమె ఫోటోలను చూస్తూనే చెప్పేయవచ్చు.
మంచి పనులతో సాగిన ఘనమైన పెళ్లి వేడుక
నయనతార (Nayanthara), విఘ్నేష్‌లు.. వీరిరువురూ తమ పెళ్లి సందర్భంగా ఎన్నో మంచి పనులు కూడా చేశారు. ఆశ్రమాల్లో లక్ష మందికి అన్నదానం చేశారు. 18 వేల మంది చిన్నారులకు కూడా భోజనం పెట్టించారు. ఆ విధంగా నయన్, విక్కీలు తమ మంచి మనుసు చాటుకున్నారు.
నయనతార, విఘ్నేష్‌లు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు పెళ్లి లైవ్ టెలికాస్ట్ హక్కులను విక్రయించారు. వీరి పెళ్లి వేడుకను స్ట్రీమింగ్ చేయడం కోసం, ఆ ఓటీటీ దిగ్గజం భారీ రేటు చెల్లించిందట. ఆ డబ్బుతో పేదవారికి సహాయం చేయాలని నయన్, విక్కీలు ఫిక్స్ అయ్యారట. వీరి వివాహ రిసెప్షన్‌కు మాత్రం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారట. జూన్ 11న నయనతార, విఘ్నేష్‌ల రిసెప్షన్ జరగనుంది.
Read More: నయనతార నటనా ప్రతిభను చాటిన.. టాప్ 10 చిత్రాలు మీకోసం ప్రత్యేకం !
Follow Us