Advertisement

Bimbisara Movie: 'బింబిసార' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram)!

Bimbisara Movie: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. 'ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌' అన్నది ట్యాగ్‌ లైన్‌. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్.. ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. 

‘బింబిసార’ (Bimbisara) చిత్రం ట్రైలర్‌ను నిన్న కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. సోమవారం ఈ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా హీరో కల్యాణ్ రామ్, కేథరిన్ (Catherin), సంయుక్త మీనన్  నటుడు శ్రీనివాస్ రెడ్డి, చిత్రయూనిట్ తో పాటు తదితరులు హాజరయ్యారు. 

'బింబిసార' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బింబిసార’ సినిమా పార్ట్ వన్.. ఇంకా ఆ రీతిలో మరిన్ని సినిమాలు వస్తాయని తెలిపారు. మామూలుగానే ఫాంటసీ కమర్షియల్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. మల్లిడి వశిష్ఠ  దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఇంకా పలు భాగాలు వచ్చే రోజుల్లో విడుదల కానున్నాయి అని తెలిపారు. .

“బింబిసార మూడు నాలుగు పార్ట్స్ ఉండబోతుందని అంటున్నారు కదా.. ఇందులో మిమ్మల్ని, ఎన్టీఆర్ (NTR) ని కలిపి చూడవచ్చా?” అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు.. ‘అన్నీ కుదిరితే నన్ను, తమ్ముడు తారక్ ని ఒకే స్క్రీన్ పై చూస్తారు. ప్లాన్ జరుగుతోందంటూ సర్ప్రైజ్ చేశాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక, ఇప్పటికే బింబిసార (Mallidi Vashisht) సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ అన్నీకూడా నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూస్తే.. విజువల్ ఫీస్ట్ లాగా రూపొందించారు. ట్రైలర్ లో బింబిసారుడిగా కళ్యాణ్ రామ్‌ విశ్వరూపం చూడబోతున్నారు ఫ్యాన్స్. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ ఘట్టాలు, పవర్ పుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. 

Read More: Kalyan Ram Birthday Special: నటుడిగానూ, నిర్మాతగానూ రాణిస్తూ.. తాత బాటలో నడుస్తున్న మనవడు ‘కళ్యాణ్ రామ్’

Advertisement
You May Also Like These
Advertisement