అమితమైన ప్రేమ అమ్మ
అంతులేని అనురాగం అమ్మ
అలుపెరుగని ఓర్పు అమ్మ
అద్భుతమైన స్నేహం అమ్మ
అపురూపమైన కావ్యం అమ్మ
మాతృదినోత్సవ శుభాకాంక్షలు అంటూ సినీ పెలబ్రేటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అమ్మ అనురాగాన్ని గుర్తుచేసుకున్నారు. అమ్మకు ప్రేమతో అంటూ కవితలతో మదర్స్‌ను హ్యాపీ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి తన అమ్మతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. చిరంజీవి తన అమ్మతో కలిసి భోజనం చేయడం, ఆనందంగా మాట్లాడుకోవడం లాంటి వీడియోలతో మగువా సాంగ్ యాడ్ చేసి పోస్ట్ చేశారు. అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
మహేష్ బాబు తన అమ్మ కోసం మదర్స్ డే రోజు స్పెషల్ పోస్ట్ పెట్టారు. తనకు జన్మనిచ్చిన అమ్మకు, ప్రపంచంలోని తల్లులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ ప్రేమను రీప్లేస్ చేసేది ఏదీ లేదని.. అమ్మపై గౌరవం ఎప్పటీకీ పెరుగుతూనే ఉంటుందన్నారు.
అమ్మపై ఉన్న అనురాగం ఎంత ఉందో చెప్పడానికి ఏ పదాలు కూడా సరిపోవంటూ హీరో నాగ సౌర్య పోస్ట్ చేశారు. తన బలం, తన ప్రపంచం తన అమ్మే అంటూ నాగ సౌర్య ట్వీట్ చేశారు.
రాహుల్ రవీంద్ర కూడా తన అమ్మతో కలిసిన ఫోటోను రీ ట్వీట్ చేస్తూ విష్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ కూడా తన తల్లి పిక్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. తను ఓ బ్యాడ్ సన్ అయినా.. తన అమ్మ ఎప్పుడూ తనకు గొప్ప అమ్మగా ప్రేమను పంచుతూనే ఉంటుందని రామ్ గోపాల్ వర్మ తన ఫీలింగ్ షేర్ చేశారు.
Follow Us