Mehabooba Video Song: మండే గుండెలో చిరు జ‌ల్లై వ‌చ్చిన మెహ‌బూబా.. కంగ్రాట్చులేష‌న్స్

Mehabooba Video Song: య‌శ్, శ్రీనిధి శెట్టి న‌టించిన ల‌వ్ సాంగ్ మోహ‌బూబా ఫుల్ వీడియో యూట్యూబ్‌లో దూసుకెళుతుంది


మండే గుండెలో
చిరుజల్లై వస్తున్నా
నిండు కౌగిలిలో
మరుమల్లెలు పూస్తున్నా

ఏ అలజడి వేళనైనా
తలనిమిరే చెలినై లేనా
నీ అలసట తీర్చలేనా
నా మమతల ఒడిలోనా

మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… ఓ మై తెరి మెహబూబా

చనువైన వెన్నెల్లో చల్లారనీ
అలలైనా దావానలం
ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు
జత కావాలి అందాల చెలి పరిమళం
రెప్పలే మూయని విప్పు కనుదోయికి
లాలి పాడాలి పరువాల గమదావనం

వీరాధి వీరుడివైన
పసివాడిగ నిను చూస్తున్నా
నీ ఏకాంతాల వెలితే
పూరిస్తా ఇకపైనా

మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… ఓ మై తెరి మెహబూబా

హుహు హూ మ్ హూ హూ హూ
హుహు హూ మ్ ఊహుఁ హుఁ

Mehabooba Video Song: య‌శ్, శ్రీనిధి శెట్టి జంట‌గా న‌టించిన కేజీఎఫ్2 నుంచి మెహ‌బూబా సాంగ్‌ను రిలీజ్ చేశారు. ల‌వ్ సాంగ్ మోహ‌బూబా ఫుల్ వీడియో యూట్యూబ్‌లో దూసుకెళుతుంది. రవి బస్రూర్ సంగీతం అదుర్స్ అంటున్నారు. 

కేజీఎఫ్ చాప్ట‌ర్2 ప్ర‌పంచ వ్య‌ప్తంగా రిలీజ్ అయి బాక్పాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ సునామీ సృష్టించింది. ఈ సినిమా పాట‌లు ఆడియ‌న్స్ మ‌న‌సుకు న‌చ్చేశాయి. య‌శ్, శ్రీనిధి శెట్టి మ‌ధ్య ల‌వ్ సాంగ్ మెహ‌బూబాకు సూప‌ర్ హిట్ అయింది. ఆ పాట ఫుల్ ఒరిజ‌న‌ల్ వీడియోను హోంబ‌లే ఫిలిమ్స్ య్యూటూబ్‌లో విడుద‌ల చేసింది. 

Mehabooba Video Song: కేజీఎఫ్ చాప్ట‌ర్2 విడుద‌లై 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 25 రోజులు పూర్తి చేసుకోవ‌డంపై చిత్ర యూనిట్ సంతోషం వ్య‌క్తం చేస్తుంది. రీసెంట్‌గా మ‌ద‌ర్ సాంగ్ ఎద‌గ‌రా.. ఎద‌గ‌రా.. రిలీజ్ చేశారు. ఆ త‌ర్వాత రొమాంటిక్ సాంగ్ మెహ‌బూబా ఫుల్ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. శ్రీనిధి శెట్టి కూడా మెహ‌బూబా సాంగ్‌ను ట్వీట్ చేశారు. 

 

శ్రీనిధి శెట్టితో య‌శ్ మెహ‌బూబా అంటూ చేసిన రొమాన్స్ చూసి ఆడియ‌న్స్ ఫిదా అయ్యారు. య‌శ్, శ్రీనిధి మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంద‌ని అంటున్నారు. హోంబలే ఫిలిమ్స్, విజ‌య్ ఈ సినిమాను నిర్మించారు.  

You May Also Like These