హైదరాబాద్‌లో మేడే వేడుకల్లో చిరంజీవి (Chiranjeevi)
నేడు మేడే (ప్రపంచ కార్మిక దినోత్సవం) సందర్భంగా తెలుగు చలన చిత్ర కార్మిక మహోత్సవాన్ని నిర్వహించారు. దీనిని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీగా నిర్వహిస్తున్నారు.
Photo Credit :
PINKVILLA
హైదరాబాద్‌లో మేడే వేడుకల్లో చిరంజీవి (Chiranjeevi)
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తదితరులు హాజరయ్యారు. ఇక, ఈ కార్యక్రమంలో పది వేలమంది కార్మికులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు.
Photo Credit :
PINKVILLA
హైదరాబాద్‌లో మేడే వేడుకల్లో చిరంజీవి (Chiranjeevi)
ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. సినీ కార్మికులందరు చేసుకుంటున్న పండుగకు తనను ఆహ్వానించిన సందర్భంగా ఫెడరేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. నాకు తెలుసి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదని పేర్కొన్నారు. ఇక, ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు.
Photo Credit :
PINKVILLA
హైదరాబాద్‌లో మేడే వేడుకల్లో చిరంజీవి (Chiranjeevi)
ఇలాంటి సినీ కార్మికోత్సవాలు నిరంతరం జరగాలని, కార్మికులు ఉద్యమించి తెచ్చుకున్న పండుగ ఇది అని ఆయన వెల్లడించారు. అదే విధంగా సినీ పరిశ్రమలో ఎవరి దారి వారిదే అవడం వల్లే ఇంతకు ముందు ఇలాంటి మేడేను జరుపుకోలేదని పేర్కొన్నారు. ఈ రోజు కోసమే అమెరికా పర్యటనను సైతం వాయిదా వేసుకుని వచ్చానని పేర్కొన్నారు.
Photo Credit :
PINKVILLA
హైదరాబాద్‌లో మేడే వేడుకల్లో చిరంజీవి (Chiranjeevi)
ఈ సందర్భంగా అంతకుముందు గురువారం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి దొరై, కోశాధికారి సురేష్, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు ఫెడరేషన్‌కు సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు.
Photo Credit :
PINKVILLA
Follow Us