సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ (Celebrity Cricket Carnival) ఈవెంట్లో టాలీవుడ్ సెలబ్రెటీలు
సెప్టెంబర్ 24న అమెరికాలోని డల్లాస్లో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ (Celebrity Cricket Carnival) ట్రోఫీ, జెర్సీని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆవిష్కరించారు.
Photo Credit :
pinkvilla
సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ (Celebrity Cricket Carnival) ఈవెంట్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి
అమెరికాలోని ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ సంస్థను సపోర్ట్ చేయడానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ ముందుకు వచ్చారు.
Photo Credit :
pinkvilla
సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ (Celebrity Cricket Carnival) ఈవెంట్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, థమన్, శ్రీకాంత్
అమెరికాలోని డల్లాస్లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA)తో సెప్టెంబర్ 24న డే & నైట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCC) ఇవ్వాలని నిర్ణయించారు.
Photo Credit :
pinkvilla
సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ (Celebrity Cricket Carnival) ఈవెంట్లో టాలీవుడ్ సెలబ్రెటీలు
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్ (Prakash Raj) ముఖ్య అతిథులుగా, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్, తమన్, సుధీర్ బాబుతోపాటు జట్టు సభ్యులు, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ CEO రాజీవ్, సభ్యులు పాల్గొన్నారు.
Photo Credit :
pinkvilla
సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ (Celebrity Cricket Carnival) ఈవెంట్లో జెర్సీని ఆవిష్కరిస్తున్న టాలీవుడ్ సెలబ్రెటీలు
ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా విజయవంతం అయినప్పుడు కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు కలిగే సంతృప్తి చాలా గొప్పదన్నారు. ఒక ఉద్యమంలా బ్లడ్ బ్యాంక్ (Chiranjeevi Blood Bank) స్థాపించడానికి కారణం కూడా అదే. మనకు ఎంతో ఇచ్చిన ప్రేక్షకులకు తిరిగి ఏమిస్తున్నామని ఉద్భవించిన ప్రశ్నలో నుంచి వచ్చిన ఆలోచనే బ్లడ్ బ్యాంకు ఏర్పాటు అన్నారు.
Photo Credit :
pinkvilla
Follow Us