Thalapathy Vijay: దళపతి విజయ్ సినిమాకి.. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ?

Thalapathy Vijay : దళపతి విజయ్ సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని ఓ టాక్ ప్రస్తుతం చిత్రపురిలో నడుస్తోంది

వారిసు.. ప్రస్తుతం తమిళ దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న సినిమా. ఇది తెలుగులో 'వారసుడు' పేరుతో రిలీజవుతోంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. 

ఈ వార్తలో నిజమెంత ?

విజయ్ నటిస్తున్న 'వారసుడు' సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తెలుగులో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు. 

మహేష్ బాబు (Mahesh Babu) గతంలో కూడా పలు హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చి తన సహృదయతను చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ 'జల్సా', ఎన్టీఆర్ 'బాద్షా' సినిమాలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

సంక్రాంతికి రిలీజ్

'వారిసు' చిత్రం 2023 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని నిర్మాతలు అంటున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, విజయ్ సరసన కథానాయికగా రష్మిక మందాన ఎంపికైంది. ఖుష్బు, ప్రకాష్ రాజు, యోగిబాబు, శరత్ కుమార్, శ్రీకాంత్, ప్రభు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. 

ఇక ప్రస్తుతం మహేష్ బాబు (Mahesh Babu) విషయానికి వస్తే, ఆయన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఓ చిత్రానికి ఓకే చెప్పారు. ఈ మధ్యనే మహేష్ నటించిన 'పోకిరి' సినిమాని మళ్లీ కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో రీ రిలీజ్ చేయగా, దాదాపు రూ. కోటి రూపాయలకు పైగా కలెక్షన్ రావడం విశేషం. 

ఇటీవలే మహేష్ బాబు (Mahesh Babu) నటించిన 'సర్కారు వారి పాట' కూడా విడుదలై హిట్ చిత్రంగా నిలిచింది. మంచి కలెక్షన్లనే రాబట్టింది. అలాగే మహేష్ తన చిత్ర నిర్మాణ సంస్థ 'జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్'తో పాటు కొన్ని ఇతర సంస్థల సహాయంతో అడివి శేష్ కథానాయకుడిగా 'మేజర్' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. 

Read More: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్ ఆర్టికల్ మీకోసం 

 

Credits: Instagram
You May Also Like These