Advertisement

Dulquer Salman: చిరకాలం గుర్తిండి పోయే అద్భుతమైన ప్రేమ కథ 'సీతారామం' (Sitarmam) సినిమా..!

దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా, టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో దుల్కర్ (Dulquer Salman) సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న నటించింది.

ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో  ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 

దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) మళయాళ హీరో అయినా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలలో తెలుగులోకి తక్కువ సినిమాలే డబ్ అయినా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ సూపర్ హ్యాండ్సమ్ హీరో. అయితే.. ఇప్పుడు 'సీతారామం' ద్వారా డైరెక్ట్ హిట్ కోసం రెడీ అవుతున్నారు దుల్కర్. 

ఇక, ‘సీతారామం’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన వివిధ పాత్రల లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ లాంఛ్ (Sitaramam Traielr Launch Event) కార్యక్రమం చిత్రయూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమంలో హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) మాట్లాడుతూ.. "అభిమానులందరూ రొమాంటిక్ హీరో, రొమాంటిక్ హీరో అని పిలుస్తుంటే.. విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని నిర్ణయించుకున్నా. అలాంటి సమయంలో హనుగారు ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తిండి పోయే ఎపిక్ సినిమా. ఇలాంటి కథని ఎట్టిపరిస్థితిల్లో వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. నా చివరి ప్రేమకథగా  ‘సీతా రామం’ వంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని ఫిక్సయ్యా" అని తెలిపారు. 

Read More: ప్రేమకథలు చేయకూడదని నిర్ణయించుకున్నా.. 'సీతారామం' (Sitaramam) కథ విన్నాక నిర్ణయం మార్చుకున్నా: దుల్కర్ సల్మాన్

 

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement