బాలీవుడ్ భామ కియారా అద్వాణీ (Kiara Advani), యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) తమ ప్రేమప్రయాణానికి ముగింపు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ జంట ప్రేమలో ఉందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలు, ఫంక్షన్లలో ఇద్దరూ జంటగా కనిపించడంతో నిజంగానే వారిద్దరు ప్రేమలో ఉన్నారనుకున్నారు అభిమానులు. అయితే తమ ప్రేమ విషయాన్ని ఇద్దరూ ఎక్కడ ప్రస్తావించలేదు. షేర్షా సినిమాతో రీల్ కపుల్‌గా ప్రేక్షకుల మనసు దోచిన కియారా అద్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) ఆ సినిమా షూటింగ్‌లోనే ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.
ఇద్దరూ కలిసి డిన్నర్లు, హాలీడే ట్రిప్పులంటూ విదేశాల్లో చక్కర్లు కొట్టడంతో పెళ్లెప్పుడంటూ.. కలర్‌ఫుల్ కపుల్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు, లైక్‌లతో వీరి ప్రేమాయణం జోరుగా సాగింది. ఆలియా, రణ్‌బీర్ తర్వాత పెళ్లి చేసుకోబోయే జంట వీరిదేననుకున్నారంతా. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్లే ఇద్దరూ తమ బంధానికి స్వస్తి పలికి వారివారి కెరీర్‌పై కియారా అద్వాణీ (Kiara Advani), సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. బ్రేకప్ వల్లే ఇద్దరూ ఎక్కడ కలిసి కనిపించడం లేదని అటు బీ టౌన్‌లోనూ ఇటు మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ఇద్దరూ నోరు మెదపకపోవడం గమనార్హం.
లస్ట్ సోరీస్తో ఓవర్‌నైట్ స్టార్డమ్ కొట్టేసిన కియారా టాలీవుడ్‌లోనూ భరత్ అను నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పుపొందింది. ప్రస్తుతం కియారా కియారా అద్వాణీ (Kiara Advani) భూల్భులాయా2లో నటిస్తోంది. ఈ సినిమా మే 20న విడుదల కానుంది. వరుస సినిమాలతో స్టార్‌గా ఎదిగిన సిద్దార్థ్ మల్హోత్రా కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. బీటౌన్‌లో ఓ వైపు పెళ్లి భాజాలు మొగుతుంటే మరోవైపు బ్రేకప్‌ల ట్రెండ్ నడుస్తోంది.
Follow Us