Happy Birthday Nayanthara: నయనతార బర్త్ డే స్పెషల్.. అభినయంతో ఆకట్టుకునే తార!

పెళ్లి తరువాత కూడా నయనతార (Nayanthara) వరుస సినిమా ఆఫర్లతో బిజీగా మారారు.

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) నటనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటు సౌత్.. అటు నార్త్ లోనూ పవర్ ఫుల్ పాత్రలలో నటిస్తూ నయన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పాత్రకు తగిన నటనను కనబరిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పదేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయన్.. ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా నయనతార వరుస సినిమా ఆఫర్లతో బిజీగా మారారు. ఈ రోజు నయనతార పుట్టిన రోజు సందర్భంగా పింక్ విల్లా ప్రత్యేక కథనం. 

నయనతారకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు

  • నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. 1984 నవంబర్ 18 తేదీన నయన్ జన్మించారు. కాలేజ్ రోజుల్లో మోడలింగ్ చేసేవారు. అలా మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 
  • 2003లో విడుదలైన "మనస్సినక్కరే" మలయాళ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు నయనతార. నయన్ ఇరవై ఏళ్ళ సినీ ప్రయాణంలో దాదాపు 75 సినిమాలలో నటించారు.
  • తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన చంద్రముఖి సినిమాలో నయనతార (Nayanthara) నటించారు. ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నయన్.
  • తమిళ భాషలో 'అయ్య', 'చంద్రముఖి', 'గజిని' సినిమాల్లో నయనతార కథానాయకురాలిగా నటించి పాపులర్ అయ్యారు. 
  • విక్టరీ వెంకటేష్ నటించిన లక్ష్మీ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి నయనతార  (Nayanthara) అడుగుపెట్టారు. తెలుగులో 'లక్ష్మీ', 'బాస్' చిత్రాలు నయనతారకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
  • 2006లో రిలీజైన 'ఈ', 'వల్లభ' సినిమాలతో యువతకు అభిమాన హీరోయిన్ గా మారారు నయన్.
  • శ్రీరామరాజ్యంలో నందమూరి బాలకృష్ణ శ్రీరాముడి పాత్రలో, నయనతార సీత పాత్రలో నటించారు. ఈ సినిమాలో నయనతార నటనకు గానూ 'ఫిల్మ్‌ఫేర్', 'నంది' అవార్డులు లభించాయి.
  • కర్తవ్యం, ఐరా, అమ్మోరుతల్లి, పెద్దన్న, గాడ్ ఫాదర్ సినిమాలు నయనతారకు మంచి గుర్తింపు తెచ్చాయి.
  • 2022 జూన్ 9 తేదీన నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి రజనీకాంత్, షారూఖ్ ఖాన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. 
  • నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్ లు సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలను పెంచుకుంటున్నారు. నయనతార ప్రస్తుతం కనెక్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Read More: Nayanthara : నయనతార నటనా ప్రతిభను చాటిన.. టాప్ 10 చిత్రాలు మీకోసం ప్రత్యేకం !

 

నయనతార మరిన్ని సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే నయన్.
పింక్ విల్లా
You May Also Like These