మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగా154 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు.
మెగా154 టైటిల్ టీజర్‌ను దీపావళి సందర్భంగావిడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీనికి సంబధించిన ముహూర్తం ఫిక్స్ చేస్తూ మెగా అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 24వ తేదీ ఉదయం 11:07 గంటలకు టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదల చేశారు.
ఊరమాస్ లుక్‌లో..
ఈ పోస్టర్‌లో చిరంజీవి ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ లుక్ చూస్తుంటే చిరు మాస్ లుక్‌కు అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అనిపిస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌పై బాస్ వస్తున్నాడు అని రాసి ఉండడం అంచనాలను మరింతగా పెంచేసింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మెగా154 సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
2023 సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. తాజాగా చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
Follow Us