Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరిగిపోతుంటారు. ప్రస్తుతం మరో వివాదంలో రామ్ గోపాల్ వర్మ చిక్కుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వలేదంటూ ఓ వ్యక్తి రామ్ గోపాల్ వర్మపై చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు.
రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య ట్వీట్లతో కౌంటర్లు ఇస్తున్నారు. తన మనసులో ఏమనుకుంటారో ముక్కు సూటిగా చెప్పేస్తుంటారు. ఎదుటి వారు ఏమనుకుంటారో రామ్ గోపాల్ వర్మకు అనవసరం.. తను ఏం అనుకుంటాడో అందరికీ చెప్పడం రామ్ గోపాల్ వర్మకు ఇష్టం.
శేఖర్ రాజు అనే వ్యక్తి రామ్ గోపాల్ వర్మపై చీటింగ్ కేసు పెట్టాడు. శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని కొప్పాడ శేఖర్ రాజు. రామ్ గోపాల్ వర్మ సమర్ఫణలో ఆశ ఎన్ కౌంటర్ అనే సినిమా రిలీజ్ అయింది. హైదరాబాద్ శివారులోని వెటర్నరీ డాక్డర్‌పై జరిగిన హత్యపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారు. వివాదాల కారణంగా ఆశ ఎన్ కౌంటర్ వాయిదా పడుతూ వచ్చింది. ఆ సినిమాకు సంబంధించి తన దగ్గర రామ్ గోపాల్ వర్మ డబ్బులు ఇచ్చానని శేఖర్ చెబుతున్నాడు. తనకు మళ్లీ రామ్ గోపాల్ వర్మ తిరిగి డబ్బులు ఇవ్వలేదంటూ కేసు పెట్టాడు.
ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వర్మ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. తాను వర్మకి జనవరి 2020లో రూ. 8 లక్షలు, ఆ తర్వాత మరో రూ. 20 లక్షలు, మరోసారి రూ. 28 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. తన దగ్గర తీసుకున్న డబ్బు ఆశ సినిమా విడుదలకు ముందే రామ్ గోపాల్ వర్మ ఇస్తానని చెప్పారన్నారు. కానీ సినిమా నిర్మాత రామ్ గోపాల్ వర్మ కాదు అని తెలియడంతో తాను మోసపోయానని తెలిపాడు. తనపై నమోదైన చీటింగ్ కేసుపై రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow Us