క్యూట్ క్యూట్ లుక్స్‌తో ఒకప్పుడు కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది మీనా(Meena). తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అగ్ర హీరోలు అందరితో నటించి మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలతోపాటు నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు కూడా చేసి మెప్పించింది మీనా. హీరోయిన్గా అవకాశాలు తగ్గుముఖం పట్టిన సమయంలో సాగర్ అనే బిజినెస్‌మ్యాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది మీనా (Meena). వీరిద్దరికీ ఒక కూతురు నైనిక కూడా పుట్టింది. దళపతి విజయ్ నటించిన ‘పోలీస్’ సినిమాలో హీరోకు కూతరుగా నటించి మెప్పించింది నైనిక. కూతురు పుట్టిన తర్వాత కొన్నాళ్లు నటనకు ఫుల్స్టాప్ పెట్టిన మీనా (Meena) సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తల్లి క్యారెక్టర్లు చేస్తోంది.
వెంకటేష్ నటించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక, మలయాళంలో ఇటీవల వచ్చిన ‘బ్రోడాడీ’ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్‌కు అమ్మగా యాక్ట్ చేసింది మీనా (Meena). మోహన్‌బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో కూడా ఒక బిడ్డకు తల్లిగా మీనా నటించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మీనా (Meena).. చాలా విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా మీనా (Meena) పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అప్పట్లో ప్రెగ్నెంట్ క్యారెక్టర్ వేయడం చాలా ఈజీ అని, దానిని కవర్ చేయడానికి బరువైన చీరలు కట్టుకునే దానిని అని పోస్ట్‌లో మీనా చెప్పింది. అయితే ప్రస్తుతం ఈ గెటప్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. షిఫాన్ చీరలు కట్టినా చూడ్డానికి చాలా నేచురల్‌గా ఉంటోంది’ అని మీనా చెప్పారు. ఈ కామెంట్స్ చేస్తూ షేర్ చేసిన వీడియోకు అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే మీనా (Meena) నిజంగా ప్రెగ్నెంట్ కాదని, ఓ సినిమాలో ప్రెగ్నెంట్‌గా నటిస్తున్నట్టు సమాచారం.
Follow Us