Advertisement

Biggest star can’t save a bad film says Nagarjuna : స్టార్ ఉంటేనే సినిమా హిట్టవుతుందా!

పింక్‌విల్లాతో ఇటీవలే నిర్వహించిన ముఖాముఖిలో, తండ్రీ కొడుకులైన నాగార్జున, నాగచైతన్య తమ  తదుపరి చిత్రాల గురించి ముచ్చటించారు. ప్రతీ ఒక్కరూ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా, ప్రాంతీయ భాషకు కట్టుబడి ఉండటం కూడా ముఖ్యమని, అందుకు పలు కారణాలున్నాయని నాగర్జున వివరించారు. అలాగే నేటి కాలంలో కంటెంటే సినిమాకి హీరో అని నాగ చైతన్య అభిప్రాయపడ్డారు.

కేవలం ట్రెండ్‌‌ను బట్టి సినిమాలు చేయకూడదని,  అవసరం లేకపోయినా పాన్ ఇండియా సినిమా చేయడం అనేది సరైన నిర్ణయం కాదని నాగార్జున తెలిపారు. తన రాబోయే చిత్రాలైన ఘోస్ట్ మరియు బ్రహ్మాస్త్రా గురించి అప్‌డేట్ ఇస్తూ, మరిన్ని వైవిధ్యమైన చిత్రాలను చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే చైతూ కూడా.. లాల్ సింగ్ చద్దా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూని మీరు కూడా చూసేయండి మరి. 

Advertisement
You May Also Like These
Advertisement