The Warrior: క‌ల‌ర్‌ఫుల్‌గా సాగిన 'ది వారియ‌ర్' క‌ల‌ర్ సాంగ్! రంగుల ప్ర‌పంచంలో తేలుతున్న‌ రామ్ (Ram Pothineni)

The Warrior: రామ్ పోతినేని (Ram Pothineni) న‌టించిన 'ది వారియ‌ర్' సినిమా నుంచి క‌ల‌ర్ సాంగ్ రిలీజ్

The Warrior: టాలీవుడ్ రామ్ పోతినేని (Ram Pothineni) న‌టిస్తున్న 'ది వారియ‌ర్' సినిమా నుంచి మ‌రో పాట‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 'క‌ల‌.. క‌ల‌..క‌ల‌ర్' అంటూ సాగే పాట‌ను తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రిలీజ్ చేశారు. రామ్ కోసం స్పెష‌ల్‌గా క‌ల‌ర్ సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఈ పాట‌కు రామ్ త‌నదైన స్టైల్లో స్టెప్పులు వేశారు.  కొరియోగ్రాఫ‌ర్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ మాస్ స్టెప్పులు కంపోజ్ చేశారు. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం అదిరిపోయింది. రామ జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ రాశారు. 'క‌ల‌.. క‌ల‌.. క‌ల‌ర్' పాట‌ను జ‌స్‌ప్రీత్ పాడారు. 

'ది వారియ‌ర్' సినిమాను త‌మిళ ద‌ర్శ‌కుడు లింగు సామి తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో రామ్‌కు జోడిగా కృతి శెట్టి న‌టిస్తున్నారు. 'ది వారియ‌ర్' త‌మిళ వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఐకానిక్ 'స‌త్యం సినిమాస్‌'లో ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు త‌మిళ నాడుకు చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. తెలుగు వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 10న హైద‌రాబాద్‌లోని జేఆర్సీ క‌న్వెన్ష‌న్‌లో జ‌రుగ‌నుంది.

రామ్ డాన్స్‌పై కృతి ఏమందంటే..
'రామ్  (Ram Pothineni)తో క‌లిసి సీన్స్ ఈజీగా చేస్తాను..  కానీ ఆయనతో కలిసి పాట‌ల‌కు డాన్స్ చేయడం అంటే చాలా భ‌యం వేసేది' అని కృతి శెట్టి తన మనసులోని మాటని బయటపెట్టింది. రామ్ ఎన‌ర్జీ లెవెల్స్ చూసి మొద‌ట్లో తాను కంగారు ప‌డ్డాన‌ని తెలిపింది. 'ఫైన‌ల్‌గా రామ్‌తో ఎలాగో డాన్స్ చేసి, స్టెప్పులు మ్యాచ్ చేశాను' అంటూ కృతి ఆయనతో సెట్‌లో తనకు ఎదురైన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది.  

The Warrior: 'ది వారియ‌ర్' సినిమాలో రామ్ ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ 'సత్య' పాత్రలో నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో ఈ సినిమా తెర‌కెక్కింది. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి 'ది వారియ‌ర్' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Read More: Ram Pothineni : రామ్ పోతినేని కథానాయకుడిగా వస్తున్న "ది వారియర్" థియేట్రికల్ ట్రైలర్ అదుర్స్ !

You May Also Like These