Advertisement

Nandini Rai: ఐట‌మ్ సాంగ్స్ తో అద‌ర‌గొడుతున్న‌ బిగ్ బాస్ సీజ‌న్ 2 బ్యూటీ నందినీ రాయ్!

Nandini Rai: టాలీవుడ్ నాచుర‌ల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ 2 షోలో నందినీ రాయ్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. అయితే, బిగ్ బాస్ షో (Biggboss Telugu) తర్వాత నందిని రాయ్ తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది. 

పేరుకు హైదరాబాద్ అమ్మాయే అయినా.. నందినీ రాయ్ ఉత్తరాదిలో ఫేమస్ అయింది. దీంతో బాలీవుడ్‌లోనే (Bollywood) మొదటి అవకాశం అందుకుంది. ఈ క్రమంలోనే ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ‘మాయ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఆ త‌ర్వాత‌ నందిని రాయ్ సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది. ఈ భామ‌కు నటిగా కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది. అందుకే ఈ బ్యూటీ ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో సోషల్ మీడియాలో నందినీ రాయ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. 

అయితే, ఇప్పుడు ఈ బ్యూటీకి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ఎలాంటి ఆఫర్లు వచ్చినా ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ (In the name of God) వెబ్ సిరీస్‌లో బోల్డ్ రోల్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది. సినిమాలు ఉన్నా లేకపోయినా.. నందినీ రాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా నందిని రాయ్ గ్లామర్ షోలో హద్దులు చెరిపివేస్తూ లైట్ పింక్ డ్రెస్ లో తన థైస్, ఎద‌ అందాలను ప్రదర్శించింది. 

నందినీ రాయ్ (Nandini Rai) హాట్ నెస్ కుర్రాళ్లకు పిచ్చెక్కించే విధంగా ఉంది. క్లీవేజ్ అందాలు, థైస్ అందాలని మైండ్ బ్లోయింగ్ అనిపించేలా నందిని ఎక్స్ పోజ్ చేస్తోంది. కాగా, ఈ ఫొటోలు, వీడియోలు పిచ్చెక్కిస్తున్నాయి. వీటిని చూసి కుర్రాళ్ల‌ మ‌తులు పోతున్నాయి. ప్ర‌స్తుతం ఈ భామ‌ బిగ్ స్క్రీన్‌పై పెద్దగా కనిపించకపోయినా ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తరచూ అందాల విందు చేస్తోంది.

Read more : Nandini Rai: అందచందాలతో ఆక‌ట్టుకుంటున్న అందాల భామ నందినీ రాయ్! 

Advertisement
You May Also Like These
Advertisement