అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి 'కిల్లింగ్ మెషిన్' పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు.
Photo Credit :
Pinkvilla
'ది ఘోస్ట్' మూవీ యూనిట్ తో నాగార్జున (Akkineni Nagarjuna With The Ghost Movie Unit)
ఈ నేపథ్యంలో ‘ది ఘోస్ట్’ చిత్ర ప్రమోషన్ (The Ghost Promotions) కార్యక్రమాలను శనివారం నుంచి చిత్రయూనిట్ మొదలుపెట్టింది. ఈ మేరకు చిత్రబృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ప్రశ్నలకు మూవీ యూనిట్ సమాధానమిచ్చింది.
Photo Credit :
Pinkvilla
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)
‘ది ఘోస్ట్’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో నాగార్జునతో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్.. నటులు మహేంద్ర, క్రిష్, రవి వర్మ వంటివారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.
Photo Credit :
Pinkvilla
'ది ఘోస్ట్' మూవీ యూనిట్ తో నాగార్జున (Akkineni Nagarjuna With The Ghost Movie Unit)
నాగార్జున (Akkineni Nagarjuna) మాట్లాడుతూ.. ''ది ఘోస్ట్ 'లో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు టెర్రిఫిక్ గా ఉంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సీన్స్ చేశా. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు. నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది'' అని అన్నారు.
Photo Credit :
Pinkvilla
Follow Us