'ఒకే ఒక జీవితం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శర్వానంద్ (Hero Sharwanand at Oke Oka Jeevitham Pre Release Event)
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand), రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham). డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ప్రభు నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో చిత్ర ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్.
Photo Credit :
pinkvilla
'ఒకే ఒక జీవితం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ రీతూ వర్మ (Actress Ritu Varma at Oke Oka Jeevitham Pre Release Event)
'ఒకే ఒక జీవితం' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Oke Oka Jeevitham Pre Release Event) లో అక్కినేని అమల మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నటించడం చాలా మంచి నాకు అవకాశం లభించింది. ఈ సినిమా చేయడానికి అన్ని రాష్ట్రాల నుండి కలసి వచ్చారు. కేరళ నుండి మ్యూజిక్, తమిళనాడు నుండి నిర్మాతలు, నటులు,దర్శకుడు తెలుగు అబ్బాయి, ఐరిష్ మదర్ బెంగాల్ లో పుట్టిన నన్ను తెలుగు కుటుంబంలో కోడలిగా స్వీకరించి నాకు తెలుగు నేర్పించి ఎంతగానో ఆదరించారు. అద్భుతమైన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు.
Photo Credit :
pinkvilla
'ఒకే ఒక జీవితం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు ప్రియదర్శి (Actor Priyadarshi at Oke Oka Jeevitham Pre Release Event)
రీతూ వర్మ (Ritu Varma) మాట్లాడుతూ... ‘ఒకే ఒక జీవితం’ లాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీకార్తిక్ గొప్ప దర్శకుడు. శర్వానంద్, అమల మేడమ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ‘ఒకే ఒక జీవితం’ అద్భుతమైన కథ. సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతుంది. థియేటర్ కి వెళ్లి చూడండి. మీ అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.
Photo Credit :
pinkvilla
'ఒకే ఒక జీవితం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటి అక్కినేని అమల (Actress Akkineni Amaka at Oke Oka Jeevitham Pre Release Event)
ఈ వేదికపై శర్వానంద్ (Sharwanand) మాట్లాడుతూ.. "అమలగారు కుదరదంటే.. ఆమె చేయనంటే నేను ఈ సినిమాను ఊహించుకోలేను. అంతగా అమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయారు" అని అన్నాడు. సాధారణంగా హీరోయిన్స్ ఎన్ని సీన్స్ ఉన్నాయి.. ఎన్ని సాంగ్స్ ఉన్నాయని అడుగుతుంటారు. అలా కాకుండా రీతూ వర్మ, ఒక మంచి సినిమాలో భాగం కావాలనే ఉద్దేశంతో అంగీకరించినందుకు ఆమెకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. వెన్నెల కిశోర్ కి నేను ఛాన్స్ ఇప్పిస్తే ప్రమోషన్ కి రాకుండా ఎగ్గొట్టాడు.. వాడి సంగతి తరువాత చెబుతాను" అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు.
Photo Credit :
pinkvilla
Follow Us