యాక్టర్ సలీం (Salim Ghouse) కన్నుమూత

సలీం గౌస్ (Salim Ghouse)

సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు సలీమ్‌ గౌస్‌ మరణించారు. గురువారం ఉదయం ఆయనకు గుండెఆగిపోవడంతో (Cardiac Arrest) తుదిశ్వాస విడిచారు. 1952వ సంవత్సరం జనవరి 10వ తేదీన మద్రాసులో పుట్టిన సలీమ్‌ తెలుగు, తమిళంలోని పలు సినిమాల్లో నటించారు. కమల్‌హాసన్, విజయ్‌, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. యాక్టింగ్‌తోపాటు సలీమ్‌.. థియేటర్ ఆర్టిస్టు, డైరెక్టర్‌‌గా, టీవీ యాక్టర్‌‌గా కూడా చేశాడు.

 మార్షల్ ఆర్ట్స్​లో ప్రావీణ్యం పొందిన ఈయన మణిరత్నం సినిమాల్లో కూడా నటించాడు. తన ఫ్యామిలీలో అన్ని మతాలు ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సలీం గౌస్‌కు మ్యూజిక్‌ అంటే మహా ఇష్టం. ఎంయస్ విశ్వనాథన్‌, కన్నదాసన్‌ వద్ద సలీం శిష్యరికం చేశాడు. సలీంకు ఆరు భారతీయ భాషలతోపాటుగా నాలుగు అంతర్జాతీయ భాషలు వచ్చునని సమాచారం.

రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో నాగార్జున, ఊర్మిళ హీరోహీరోయిన్లుగా నటించిన అంతం సినిమాలో సలీం ఇన్‌స్పెక్టర్‌‌ పాత్రలో నటించి మెప్పించారు. అలాగే నాగార్జునతో రక్షణ సినిమాలోనూ నటించాడు. మెగాస్టార్‌‌ చిరంజీవి త్రిపాత్రాభినయంలో నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమాలో విలన్‌గా నటించాడు.

You May Also Like These