తెలుగులో చంటి, పెదరాయుడు, కొండపల్లి రాజా, బంగారు బుల్లోడు, మా అన్నయ్య లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడే రవిరాజా పినిశెట్టి. ఆయన తనయుడే ఆది పినిశెట్టి (Aadhi Pinisetty). ఒక విచిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆది పినిశెట్టి.. గుండెల్లో గోదారి, నిన్ను కోరి, రంగస్థలం, మలుపు, యూటర్న్, క్లాప్ లాంటి సినిమాలలో నటించారు. ఈయన తనతో పాటు 'మలుపు' చిత్రంలో కథానాయికగా నటించిన నిక్కీ గల్రానీతో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమకథ ఎట్టకేలకు పెళ్లి దాకా వచ్చింది.
తాజాగా ఆది, నిక్కీల పెళ్లి వేడుక చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అంటూ నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు సైతం తెలుపుతున్నారు.
చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి ఆది, నిక్కీల వివాహం జరిగింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు.. వారి సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరయ్యారు. నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ మొదలైన టాలీవుడ్ నటులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. నిక్కీ గల్రానీ పెళ్లి చీరలో కుందనపు బొమ్మలా మారిపోయింది. రెడ్ బోర్డ్ర్ ఉన్న వైట్ శారీతో మెరిసిపోయింది.
ఇక ఆది కూడా సంప్రదాయ పెళ్లి దుస్తులలో అందంగా కనిపించారు. ఆది రూపురేఖలలో "పెళ్లి కళ" కనిపిస్తుందంటూ.. ఇప్పటికే నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో విషెస్ చెబుతున్నారు. ఇక ఈ నూతన దంపతులు ఇండస్ట్రీ వర్గాల కోసం, మరోమారు ప్రత్యేకంగా పార్టీ ఇవ్వనున్నారట.
Aadhi Pinisetty: నిక్కీ, ఆదిల హల్ది వేడుకలు, డాన్సులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. పసుపు రంగు దుస్తుల్లో ఎంతో ఆనందంగా వీరిద్దరూ వర్షంలో స్టెప్పులేశారు. వీరి డాన్సులకు అభిమానులు ఫిదా అయ్యారు. ఆది, నిక్కీలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారారు. ఆ తర్వాత వచ్చిన సినిమామరగాధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఆది, నిక్కీ పెళ్లి వేడుకల సందర్భంగా పింక్ విల్లా వారికి శుభాకాంక్షలు తెలుపుతుంది.
Follow Us