Advertisement

Syed Sohel Ryan (సయ్యద్ సొహైల్ రియాన్) : సెల్ఫీస్టార్‌గా మారిన బిగ్‌బాస్ సెలబ్రిటీ

సయ్యద్ సొహైల్ రియాన్ (Syed Sohel Ryan).. తెలుగు టీవీ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన నటుడు. కొత్తబంగారులోకం సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సొహైల్.. ఆ తర్వాత యురేకా చిత్రం ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకున్న సొహైల్, ప్రస్తుతం మిస్టర్ ప్రెగ్నెంట్ అనే చిత్రంలో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు

బిగ్ బాస్ షోలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజమ్ కలిగిన సొహైల్.. "కథ వేరుంటది, చికెన్ మటన్.. మటన్ చికెన్" లాంటి డైలాగ్స్‌తో బాగా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా సొహైల్, మెహబూబ్‌ల దోస్తీకి బిగ్ బాస్ షోలో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సింగరేణి కార్మికుల కుటుంబం నుండి వచ్చిన సొహైల్, సింగరేణి బిడ్డగా కూడా బీబీ హౌస్‌లో పలుమార్లు కితాబునందుకున్నాడు. 

ఇటీవలే ఓ ప్రైవేట్ ఫంక్షనుకి అటెండ్ అయిన సొహైల్, సెల్ఫీ స్టార్‌గా మారిపోయాడు. అడిగిన వారందరికీ లేదనకుండా సెల్ఫీ ఇస్తూ, అభిమానుల మధ్య తానొక స్పెషల్ వ్యక్తిగా మెరిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

 

Credits: PINKVILLA
Advertisement
You May Also Like These
Advertisement