ప్రముఖ‌ సింగర్ మనో (Singer Mano) ఆస్తులు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Advertisement
సింగర్ మనో (Singer Mano)

ప్రముఖ‌ సింగర్ మనో.. ఆయ‌న‌ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యం అవసరం లేదు. కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ్, కన్నడ , బెంగాలీ వంటి భాషలతో సహా భార‌త‌దేశంలోని 11 భాషలలో ఆయన పాటలు పాడడం గమనార్హం. అన్ని భాష‌ల‌లో క‌లిపి దాదాపుగా 30వేల‌కుపైగా పాటు పాడారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆయనకు ఒక సెపరేట్ స్టైల్ ఉంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ కు దాదాపు అన్ని సినిమాల‌లో డ‌బ్బింగ్ చెప్పేది సింగ‌ర్ మ‌నో. 

ఆయ‌న‌ అసలు పేరు నాగూర్ బాబు. అయితే తన పేరును మాత్రం సింగర్ మనో గా మార్చుకున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనల్లిలో ఆయ‌న‌ పుట్టి పెరిగారు. అయితే, ఆయన ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగులో ఎంతో చక్కగా పాటలు పాడడం విశేషం. చిన్న‌ప్ప‌టి నుంచీ మ‌నోకు సంగీతం అంటే చాలా ఇష్టం. దీంతో ఆయ‌న సింగ‌ర్ కాక‌ముందు మ్యూజిక్ డైరెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి వ‌ద్ద చాలా కాలం స‌హాయ‌కుడిగా ప‌నిచేశారు. గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం వ‌ద్ద సైతం ఎన్నో పాట‌ల‌కు ప‌నిచేశారు.  

Advertisement

ఇక ఈయన తండ్రి ఆలిండియా రేడియోలో కూడా పనిచేసేవారు. నేదునూరు కృష్ణ మూర్తి దగ్గర సంగీతం నేర్చుకోడానికి ఆయన తండ్రి పంపేవారు. కాగా, నాగూర్ బాబు పేరును మ‌నోగా మార్చింది... మ్యాస్ట్రో ఇళ‌యా రాజానే కావ‌డం విశేషం. కాగా, మ‌నో కేవ‌లం సింగ‌ర్ గానే కాకుండా కొన్ని చిత్రాల‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. ఆయ‌న‌కు ముగ్గ‌రు కుమారులు.. కాగా, ఒక కూత‌రు. ముగ్గురి కుమారుల‌లో ఒక కొడుకు చిన్న వ‌య‌సులోనే మ‌ర‌ణించాడు. అయితే. ఆ మ‌ధ్య‌ మ‌నో బిజినెస్, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం వైపు కూడా అడుగులు వేశాడు. ఇందులో దాదాపు రూ.560 కోట్లు సంపాదించినట్లుగా తెలుస్తోంది. ఇక‌, ప్ర‌స్తుతం ఆయ‌న బుల్లితెర‌పై కొన్ని షోల‌కు న్యాయ‌నిర్ణేత‌గా సైతం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో పాటు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగ‌ర్ గా, న‌టుడిగా బాగానే సంపాదిస్తూ కొన్ని కోట్లు రూపాయ‌లు సంపాదించాడు ఈ సింగ‌ర్.

Advertisement
You May Also Like These
Advertisement