ENTERTAINMENT

హిందీ చిత్ర‌సీమ‌ను ఏలుతున్న అందాల‌ ఆలియా

Nidhan Singh

OCT 09, 2022

తండ్రి డైరెక్ట‌ర్.. త‌ల్లి న‌టి 

బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా పేరున్న మ‌హేశ్ భ‌ట్ కూతురే ఆలియా భ‌ట్. ఆలియా త‌ల్లి సోనీ ర‌జ్దాన్ కూడా న‌టి కావ‌డం విశేషం. ముంబైలోని జ‌మ్నాబాయి న‌ర్సీ స్కూల్ లో ఆలియా ప్రాథ‌మిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది

Image: Alia Bhatt Instagram

Image: Alia Bhatt Instagram

బాలనటిగా ప్రారంభమైన కెరీర్

బాల‌న‌టిగా సంఘ‌ర్ష్ అనే హిందీ చిత్రంలో  అలియా న‌టించింది. ఈ మూవీ 1999లో విడుద‌లైంది. 2012లో క‌ర‌ణ్ జోహర్ ద‌ర్వ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ సినిమాలో ప్ర‌ధాన నాయిక పాత్ర‌ను పోషించింది

Image: Alia Bhatt Instagram

వ‌రుస హిట్స్‌తో టాప్ ప్లేస్‌కు

టు స్టేట్స్, హంప్టీ శ‌ర్మా కీ దుల్హ‌నియా, ఉడ్తా పంజాబ్, బ‌ద్రీనాథ్ కీ దుల్హ‌నియా, గ‌ల్లీ బాయ్ లాంటి సినిమాల‌తో బాలీవుడ్‌లో ఆలియా భ‌ట్ త‌న స్థానాన్ని ప‌దిల‌ప‌ర్చుకుంది

Image: Alia Bhatt Instagram

నటనతో అలరించిన మేటి కథానాయిక

మ‌హిళా ప్ర‌ధాన చిత్రాలుగా తెర‌కెక్కిన హైవే, రాజీ, గంగూబాయి క‌తియావాడి లాంటి అలియా చిత్రాల్లో త‌న‌దైన మార్క్ న‌ట‌న‌తో స‌త్తా చాటింది.  టాప్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్‌తో కొన్నాళ్లు ప్రేమాయ‌ణం న‌డిపిన ఆలియా.. 2022 ఏప్రిల్ 14 తేదిన అత‌డిని పెళ్లాడింది

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here