ENTERTAINMENT

ప్రేక్షకుల మనసులు దోచిన క్రష్మిక

Nidhan Singh

OCT 06, 2022

చదువులోనూ టాపర్

రష్మిక నటనలోనేకాదు చదువులోనూ టాపర్. కర్నాటకలోని కొడగు జిల్లా, విరజ్ పేట్‌లో జన్మించిన ఆమె..అక్కడి కూర్గ్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది

Image: Rashmika Mandanna Instagram

Image: Rashmika Mandanna Instagram

మోడలింగ్ టు మూవీ ఇండస్ట్రీ

చదువు పూర్తయ్యాక మోడలింగ్ వైపు అడుగులేసింది రష్మిక. బెంగళూరు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఇన్ 2014 జాబితాలో చోటు సంపాదించింది. డిజైరబుల్ విమెన్ లిస్టులో 2016 సంవత్సరంలో 24వ స్థానం దక్కించుకున్న రష్మిక.. 2017లో ఫస్ట్ ప్లేసులో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది

Image: Rashmika Mandanna Instagram

రక్షిత్ శెట్టితో ప్రేమాయణం

మోడలింగ్‌‌లో మంచి పేరు తెచ్చుకోవడంతో రష్మికకు సినిమా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో కిరిక్ పార్టీ అనేమూవీలో నటించేందుకు ఒప్పుకుంది. అప్పుడే నటుడు రక్షిత్ శెట్టితో ఆమె ప్రేమలో పడింది. తర్వాత ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే, వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు

Image: Rashmika Mandanna Instagram

పుష్పతో పెరిగిన క్రేజ్

‘ఛలో‘ సినిమా టాలీవుడ్‌లో రష్మికకు మంచి పేరుతో పాటు, వరుస అవకాశాలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించిన 'గీత గోవిందం' చిత్రం రష్మికను ఓవర్ నైట్ స్టార్ చేసింది

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here