Breakup Stories: బంధం భార‌మైతే! బ్రేకప్ చెప్పండి

Advertisement
బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలిగానీ, బాధ పెంచేదిగా ఉండ‌కూడ‌దు. మ‌న‌వి కానీ బంధాల వెంట ప‌రుగెడితే దేహానికి ఆయాసం.. మ‌న‌సుకు ఆవేదన మిగులుతుంది. నీదైతే ఎప్ప‌టికీ నిను వ‌ద‌ల‌దు.

బంధం ఏదైనా బాధను పంచుకునేలా ఉండాలిగానీ, బాధ పెంచేదిగా ఉండ‌కూడ‌దు. మ‌న‌వి కానీ బంధాల వెంట ప‌రుగెడితే దేహానికి ఆయాసం.. మ‌న‌సుకు ఆవేదన మిగులుతాయి. నీదైతే ఎప్ప‌టికీ నిను వ‌ద‌ల‌దు. నీది కాకుంటే ఎప్ప‌టికీ నీకు దొర‌క‌దు. భార‌మైన బంధాలను గురించి తెలుసుకోండిలా.

మీరు పూర్తిగా ఇత‌రుల వ‌శ‌మైపోయారా?

Advertisement

ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య ఆకర్ష‌ణ ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండాలి.  అంతేగానీ, మ‌రీ అవ‌త‌లి వారికి పూర్తిగా వ‌శ‌మైపోకూడ‌దు. వారి నియంత్ర‌ణ‌లో మీరు ఉండిపోకూడ‌దు. అలాంటి ఆక‌ర్ష‌ణను భావోద్వేగాలతో కూడిన బంధాలంటారు. శ్రుతిమించిన‌పోయిన నియంత్ర‌ణ క‌లిగిన బంధాలు ఆందోళన‌, భ‌యాన్ని క‌లిగిస్తాయి. అందుకే, కొత్త బంధాల ఆక‌ర్ష‌ణ‌ను ఆస్వాదించే ముందు వారు ఎలాంటి వారో తెలుసుకోండి. 

మిమ్మల్ని వేరే బంధాలకు దూరంగా ఉంచుతున్నారా?

కొంద‌రు వ్య‌క్తులు త‌మ‌ను ఇష్ట‌ప‌డే వారు తమతోనే ఉండాలని భావిస్తారు. అందుకే ఇత‌ర బంధాల‌కు వారిని దూరంగా ఉంచాల‌ని ప్రయ‌త్నిస్తారు. మీరు ఎవ‌రితో మాట్లాడాలి? ఎవ‌రితో ఎలా ఉండాల‌నేది వాళ్లే నిర్ణ‌యిస్తారు. ఎవ‌రితో మాట్లాడినా, త‌ప్పుగా అర్థాలు తీస్తారు. అలాంటి వారిని దూరం పెట్టండి. ఎందుకంటే బంధాల‌కు విలువిచ్చే వారు, మీ ఇతర బంధాలను కూడా గౌరవిస్తారు. 

మార్పు తీసుకురావాలి!

మీ భాగస్వామి ప్ర‌వ‌ర్త‌న రోజు రోజుకు మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఉంటే, వారిని మార్చేందుకు ప్ర‌య‌త్నించండి. వారు మారితే మంచిదే. అలాగని మీరు వారి పై ఎక్కువ ఒత్తిడి తీసుకురావద్దు. అప్పుడు మీరు  చేసిన‌ ప్ర‌య‌త్నం వృధానే అవుతుంది. మీతో బంధం మెరుగ్గా ఉండాలనుకుంటే వారే మార్పును కోరుకుంటారు అలా కాకుండా, నియంత్రించాల‌నుకుంటే వారే ఇష్ట‌ప‌డేవారిని కోల్పోతారు. 

అతి వినయం ధూర్త లక్షణం

అతి విన‌యంగా ఉండే వారు చాలా ప్ర‌మాద‌కారులు. విన‌యంగా ఉన్న‌ట్లు కావాలనే న‌టిస్తారు. అలాంటి వారిని న‌మ్మితే మొదటికే మోసం వస్తుంది. అనుకోని సమయాలలో బెదిరింపుల‌తో న‌ట్టేట ముంచుతారు. కనుక ఇలాంటి వారిని వెంటనే దూరం పెట్టండి. 

ఏ బంధంమైనా కోపంతో దూర‌మైతే.. కోపం త‌గ్గాక మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌వుతుంది.  కానీ ఒకరు మీకు బాధ‌తో దూర‌మైతే మాత్రం ఎప్ప‌టికీ దగ్గరవ్వలేరు.ఎందుకంటే ప్ర‌తీసారి బాధ‌ను త‌ట్టుకునే శ‌క్తి, మ‌న‌సుకు ఉండ‌దు. కాబ‌ట్టి, అలాంటి భావోద్వేగాలతో కూడిన బంధాల‌కు స్వ‌స్తి చెప్ప‌డ‌మే మంచిది. 

 

Credits: Instagram
Advertisement
You May Also Like These
Advertisement