Liger (లైగర్) సినిమా ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమాపై భారీ అంచనాలు !

స్టేజ్ మీద విజయ్, రణ్‌వీర్‌ల సందడి

స్టేట్ మీద రణ్ వీర్ సింగ్ (Ranveer Singh), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మొదలైన వారు హీరోయిన్ అనన్య పాండే, అలాగే నిర్మాత ఛార్మి కౌర్‌తో కలిసి స్టెప్పులేశారు. ఓ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. అక్డీ పక్డీ సాంగ్ చాలా పాపులారిటీని సొంతం చేసుకుందని, ఈ పాటకు డ్యాన్స్ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. 

రణ్‌వీర్ స్టైలిష్ ఎంట్రీ

Liger Trailer Launch Event in Mumbai:  లైగర్ సినిమా లాంచ్ వేడుకకు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే కాజువల్స్‌లో విజయ్ సందడి చేయగా, అనన్య పాండే బ్లాక్ డ్రెస్‌లో మెరిశారు. అలాగే నిర్మాత ఛార్మి కౌర్, కరణ్ జోహార్ కూడా సినీ పోలీస్ ప్రాంగణానికి చేరుకున్నారు. 

రణ్‌వీర్ సింగ్ 'లైగర్' ట్రైలర్ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ, ఈ జమానా మాస్ సినిమాలదేనని తెలపారు. అందరూ తాను నటించిన 'షంషేరా' సినిమాను చూడాలని, అలాగే తాను 'లైగర్' సినిమా కోసం ఆగస్టు 25 వరకు వేచి చూస్తానని తెలిపారు. 

రణ్‌వీర్, విజయ్‌లతో ఒక సినిమా చేయాల్సిందే

లైగర్ ట్రైలర్ లాంచ్ వేడుకకు సంబంధించి కరణ్ జోహార్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రణ్‌వీర్, విజయ్‌లతో కలిసి ఓ సినిమా చేయాలని ఉందని తెలిపారు. అలాగే విజయ్ (Vijay Deverakonda) కూడా పాన్ ఇండియా లెవల్‌కు తాను రీచ్ కావడం ఆనందంగా ఉందని చెప్పారు.

మైక్ టైసన్‌తో ఫైట్ అంటే అమ్మ భయపడింది

"అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్‌తో ఫైట్ అంటే అమ్మ చాలా భయపడింది. జాగ్రత్తగా ఉండమని హితబోధ చేసింది. కానీ మైక్ చాలా కూల్ పర్సన్. ఆయన వద్ద చాలా నేర్చుకున్నాను" అని విజయ్ దేవరకొండ తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకున్నారు

విజయ్ చాలా హాట్‌‌గా ఉన్నాడు : అనన్య పాండే

'విజయ్ చాలా హాట్‌గా ఉన్నాడు. అతని సిక్స్ ప్యాక్ చూస్తే నాకు ఎందుకో విజిల్ వేయాలని అనిపించింది' అని అనన్య పాండే తన మదిలోని మాటలను వేదిక మీద పంచుకున్నారు. విజయ్‌తో నటించి తాను చాలా విషయాలను నేర్చుకున్నానని ఆమె తెలిపారు. లైగర్ సినిమా ఒక చరిత్రను తిరగరాస్తుందని ఆమె పేర్కొన్నారు. 

ముంబయిలో లైగర్ ట్రైలర్ లాంచ్‌కు సర్వం సిద్ధం

ముంబయిలో లైగర్ సినిమా ట్రైలర్ లాంచ్‌కు అతిరథ మహారథులు ఎందరో హాజరుకానున్నారు. అలాగే ఎందరో బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ లైగర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు 

నేను కరణ్ జోహార్‌కి పెద్ద ఫ్యాన్‌ని

లైగర్ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్ తాను బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్‌కు పెద్ద ఫ్యాన్‌ని అని తెలిపారు. 

ముంబయి అంథేరీలోని సినీపోలీస్‌లో ఘనంగా లాంచ్

Liger Hindi Trailer Launch Event: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటిస్తున్న Liger (లైగర్) సినిమాకి సంబంధించిన హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 21 జులై 2022 తేదిన ముంబయి అంథేరీలోని సినీ పోలీస్‌లో ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్‌కు రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. సాయంత్రం 6. 15 నిమిషాలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. 

Liger (లైగర్) సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎంఎంఏ బాక్సర్ పాత్రను పోషిస్తున్నారు. అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

అలాగే ఈ సినిమాలో అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson)  కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే విజయ్ తల్లి పాత్రలో  రమ్యకృష్ణ (Ramya Krishna)  నటిస్తున్నారు. లైగర్ (Liger) సినిమాలో  పూర్తి మాస్ లుక్‌తో దర్శకుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పాత్రను డిజైన్ చేశారు. ఇప్పటికే తెలుగులో లైగర్ (Liger) సినిమా ట్రైలర్ రిలీజ్ ఘనంగా జరిగి, అభిమానుల ఆదరణను పొందుతోంది. 'సాలా.. క్రాస్ బ్రీడ్ ' అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.