సౌత్ హీరోల‌ హీరోయిజం (Pan India Tollywood Stars)

సౌత్ ఇండియా హీరోలు త‌గ్గేదేలేదంటున్నారు. పాన్ ఇండియా హీరోలు కొంద‌రైతే. పాన్ వ‌ర‌ల్డ్ హీరోగా మారేందుకు మ‌రికొంద‌రు ట్రై చేస్తున్నారు. ఇది సౌత్ ఇండియా హీరోయిజం అంటున్నారు.

దక్షిణాది హీరోలు అస్సలు త‌గ్గేదేలే అంటున్నారు. ఇందులో కొందరు పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీని సొంతం చేసుకుంటే.. మరికొందరు పాన్ వ‌ర‌ల్డ్ హీరోలుగా మారేందుకు ట్రై చేస్తున్నారు. ఇది సౌత్ ఇండియా హీరోయిజం అంటున్నారు. 

సినీ చరిత్రలో మొదటి పాన్ ఇండియా హీరోగా ద‌క్షిణాది నుంచి ర‌జినీకాంత్ గుర్తింపు తెచ్చుకున్నారు. సూప‌ర్ స్టార్ త‌ర్వాత చాలా ఏళ్ళ‌కు ప్ర‌భాస్ ఆ పేరు తెచ్చుకున్నారు.  బాహుబ‌లి సినిమాల‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టారు. ఇదే క్రమంలో డార్లింగ్ పాన్ ఇండియా హీరో అయ్యారు. ఇక భవిష్యత్తులో ద‌క్షిణాది నుంచి మ‌రికొంద‌రు కథానాయకులు పాన్ ఇండియా హీరోలుగా మారునున్నారని టాక్. వారిపై స్పెష‌ల్ స్టోరి. 

1. రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)

సినిమాలు: ఆర్. ఆర్. ఆర్, శంక‌ర్.

జంజీర్, మ‌గ‌ధీర సినిమాల‌తో రామ్ చ‌ర‌ణ్ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. ఆర్. ఆర్. ఆర్. సినిమా అత‌నిని పాన్ ఇండియా హీరో చేస్తుంద‌ని అభిమానులు న‌మ్ముతున్నారు.

2. ఎన్టీఆర్ (NTR)

సినిమా : ఆర్. ఆర్. ఆర్.

కొమ‌రం భీముడిగా ఆర్. ఆర్. ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌నకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ న‌ట‌నే ఎన్టీఆర్‌ను పాన్ ఇండియా హీరో చేస్తుందంటున్నారు. 

3.యశ్ (Yash)

సినిమా: కేజీఎఫ్-2.

కే.జీ. ఎఫ్ మూవీ యశ్‌ను పెద్ద స్టార్‌ను చేసింది. కానీ కె. జీ. ఎఫ్ 2 సినిమా అంతకంటే పెద్ద సూపర్ హిట్ కొట్టింది. థియేట‌ర్లను ద‌ద్ద‌రిలేలా చేసింది. దీంతో య‌శ్ అతి త్వరలో పాన్ ఇండియా హీరోగా మార‌నున్నారు.. 

4. అల్లు అర్జున్ (Allu Arjun)

సినిమా: పుష్ప‌

పుష్పా అంటే ఫ్లవర్ అనుకొంటివా.. పుష్పా అంటే ఫైర్ .. త‌గ్గేదేలే అంటూ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా కొత్త అవతారం ఎత్తాడు. ప్ర‌భాస్ త‌ర్వాత హిందీలో పుష్ఫ సినిమాతో ట్రెండ్ సెట్ చేశాడు. 

5. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Devarakonda)

సినిమా: లైగ‌ర్

విజ‌య్ దేవ‌రకొండ అర్జున్ రెడ్డి సినిమాతో అద‌ర‌గొట్టేశాడు.  ఇదే క్రమంలో  బాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించిన ఈ రౌడీ హీరో, లైగ‌ర్ సినిమాతో పాన్ ఇండియా హీరో కానున్నాడు. 

6. సూర్య‌ (Surya)

సినిమా - ఆకాశమే హద్దురా

కాస్త లేటైనా పాన్ ఇండియా హీరో త‌ప్ప‌క అవుతానంటున్నారు సూర్య‌.  ఈయన మంచి క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల మందుకు వ‌స్తుంటారు. సూరారి పొట్ట్రూ (తెలుగులో ఆకాశమే హద్దురా) సినిమా ద‌క్షిణాదిలో బాక్స్ బ‌ద్ద‌లుకొట్టింది. ఇతర భాషల వారిని కూడా ఆకట్టుకుంది. దీంతో ఈయన పాన్ ఇండియా హీరోగా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 

7. ధ‌నుష్ (Dhanush)

సినిమాలు: శేఖ‌ర్ ఖ‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా,  ది గ్రే మ్యాన్ (హాలీవుడ్ మూవీ)

ద‌క్షిణాది అన్ని భాష‌ల్లో ధనుష్ క్రేజ్ అంతాఇంతా కాదు. షమితాబ్, రాంఝనా  లాంటి బాలీవుడ్ సినిమాల‌తో ఈయన మంచి పేరు తెచ్చుకున్నాడు. ధ‌నుష్ తాను చేస్తున్న హాలీవుడ్ సినిమాతో... పూర్తిస్థాయి పాన్ ఇండియా హీరో అవుతాడ‌ని టాక్. 

8. ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty)

సినిమా : చార్లీ

చార్లీ సినిమాతో ర‌క్షిత్ శెట్టి పాన్ ఇండియా హీరో తప్ప‌క అవుతాడ‌ని అభిమానులు అంటున్నారు. 

ద‌క్షిణాది హీరోలు కొంద‌రు పాన్ ఇండియా హీరోలుగా మారుబోతుంటే.. హీరో ప్ర‌భాస్ ఏకంగా పాన్ వ‌ర‌ల్డ్ హీరోగా మారేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. 

 

You May Also Like These