ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ (NTR, Kalyan Ram)
నేడు తిరుగులేని కథానాయకుడు... ఎదురులేని మహానాయకుడు... విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్‌కు వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అలాగే, ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Photo Credit :
pinkvilla
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ (NTR, Kalyan Ram)
ఉదయం నుంచే రద్దీ ఉండటంతో వచ్చి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు ఈ హీరోలిద్దరూ. ఇక అభిమానులు కూడా ఉదయం నుంచే ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) కి క్యూ కట్టారు. ఈ సారి శత జయంతి కావడంతో మరింతమంది ఎన్టీఆర్ ఘాట్ కి విచ్చేస్తున్నారు.
Photo Credit :
pinkvilla
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ (NTR, Kalyan Ram)
తెలుగు వారి యుగపురుషుడు, మహా నేత, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR Ghat)గారి జయంతి. ఈ సారి ఆయన శత జయంతి కూడా కావడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తారని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ ని నిన్న రాత్రే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
Photo Credit :
pinkvilla
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ (NTR, Kalyan Ram)
ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజున నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ (NTR Ghat) దగ్గర గల ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి మహానాయకుడి నివాళులు అర్పించడం ఆనవాయితీ. హరికృష్ణ కుమారులు, ప్రముఖ హీరోలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), కళ్యాణ్ రామ్ ఈ రోజు ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ చేరుకున్నారు. తాతయ్యకు నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తమ అభిమాన కథానాయకుడు, మహానాయకుడిని ప్రజలు స్మరించుకుంటున్నారు.
Photo Credit :
pinkvilla
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ (NTR, Kalyan Ram
తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన శక పురుషుని (NTR) శత జయంతి సంవత్సరం ఇది.
Photo Credit :
pinkvilla
Follow Us