శ్రీ విష్ణు (Sree Vishnu)
టాలీవుడ్ విలక్షణ నటుల్లో యంగ్ హీరో శ్రీ విష్ణు ఒకరు (Sree Vishnu). సినిమా జయాపయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు ఈ హీరో. తనదైన సింపుల్ నటనతో ప్రతి సినిమాలో తాను ఆకట్టుకుంటారు శ్రీ విష్ణు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అల్లూరి. "నిజాయితీకి మారుపేరు" అనే ట్యాగ్ లైన్ ని ఆడ్ చేశారు మేకర్స్.
Photo Credit :
Pinkvilla
శ్రీ విష్ణు (Sree Vishnu)
ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన శ్రీ విష్ణు ఈ చిత్రం ద్వారా ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్నాడు. కాగా, ఈ చిత్రం నుంచి ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమా తో ప్రదీప్ వర్మ (Pradeep Varma) దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.
Photo Credit :
Pinkvilla
శ్రీ విష్ణు (Sree Vishnu)
'అల్లూరి' (Alluri Movie) లో శ్రీ విష్ణు లుక్ చూస్తే ఈ సినిమా కోసం తాను బాడీ కూడా చాలా సాలిడ్ గా మార్చినట్టు అనిపిస్తుంది. ఇంకా తన మీసకట్టు, సినిమా క్యాప్షన్ అంతా చూస్తే ఈ సినిమాలో తన పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అర్ధం అవుతుంది. మొత్తానికి అయితే ఈ పోస్టర్ మాత్రం మంచి అంచనాలు పెంచింది. ఇక ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా లక్కీ మీడియా వారు నిర్మాణం వహిస్తున్నారు.
Photo Credit :
Pinkvilla
శ్రీ విష్ణు (Sree Vishnu)
శ్రీ విష్ణు (Sree Vishnu) మొదటి సారిగా పోలీస్ రోల్లో సినిమా చేస్తుండటంతో ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు. శ్రీ విష్ణూ ఎప్పటిలాగానే ఈ సారి కూడా విభిన్న కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. కాగా ఈసారి కమర్షియల్ హంగులను కూడా జోడించాడు.
Photo Credit :
Pinkvilla
Follow Us