హీరో సత్యదేవ్ (Hero Satyadev)
Godse Movie: టాలీవుడ్ లోని సపోర్టింగ్ ఆర్టిస్టుగా రంగప్రవేశం చేసి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి.. విభిన్న చిత్రాలు చేస్తూ.. విలక్షణమైన నటనతో ఓ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ సెన్సేషన్ సత్యదేవ్. కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈ హీరో.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'జ్యోతి లక్ష్మీ' అనే మూవీతో హీరోగా మారాడు. అంతేకాదు, అదిరిపోయే నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
Photo Credit :
Pinkvilla
హీరో సత్యదేవ్ (Hero Satyadev)
ఈ క్రమంలోనే సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కించిన చిత్రం 'గాడ్సే'. సీకే స్క్రిన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi) హీరోయిన్గా నటించింది. సునీల్ కశ్యప్ బాణీలు కట్టారు. సందేశాత్మక కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను నేడు (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Photo Credit :
Pinkvilla
హీరో సత్యదేవ్ (Hero Satyadev)
ఒక బొమ్మ తుపాకీ కూడా ఉపయోగించడం ఇష్టం లేని ఓ వ్యక్తి.. సీరియల్ కిల్లర్‌గా మారే కథే గాడ్సే. అయితే ఈ కథ, ఒరిజినల్ గాడ్సే కథకు ఏ సంబంధం లేదని దర్శకుడు స్పష్టం చేశాడు. ఇది ఎంటర్టైనర్ కాదని ఆలోచింపజేసే సినిమా అని స్పష్టం చేశాడు. అయితే ముందుగా ఈ కథను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోసం రాసుకున్నానని కానీ ఆయన వరకు వెళ్లలేకపోయానని అన్నాడు గోపీ. ఇక ఈ శుక్రవారం విడుదల కానున్న విరాటపర్వంకు పోటీగా గాడ్సే చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది.
Photo Credit :
Pinkvilla
హీరో సత్యదేవ్ (Hero Satyadev)
వినూత్నమైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సత్యదేవ్ నటించిన 'గాడ్సే'.. ప్రభుత్వం తీసుకునే లోటుపాట్లపై ఓ యువకుడు చేసే పోరాటంతో రూపొందింది. ఈ మూవీ సందేశాత్మకమైన కథతో రాబోతుంది. దీన్ని యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ఇందులో సత్యదేవ్ (Hero Satyadev) పాత్ర మరింత హైలైట్‌గా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.
Photo Credit :
Pinkvilla
హీరో సత్యదేవ్ (Hero Satyadev)
ఇందులో హీరో సత్యదేవ్ (Hero Satyadev) వన్ మ్యాన్ షో ప్రదర్శించారని, ఆయన డైలాగ్స్ తూటాల్లా పేలాయని ఆడియన్స్ అంటున్నారు. సినిమాలో ఇంటర్వెల్ సీన్ హైలైట్ అనే టాక్ బయటకొచ్చింది. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయని, ఇవే ఈ సినిమాకు ప్లస్ అని చెబుతున్నారు. అయితే డైరెక్టర్ కథను నడిపించిన విధానం గ్రిప్పింగ్‌గా లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఉత్కంఠరేపే ఫస్టాఫ్.. అందుకు కొనసాగింపుగా సెకండాఫ్ సాగిపోయిందని అంటున్నారు.
Photo Credit :
Pinkvilla
Follow Us