హీరో రామ్ పోతినేని (Ram Pothineni)
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకడు రామ్ పోతినేని (Ram Pothineni). ఈ హీరో గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు రామ్ పోతినేని. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా దేవదాసుతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా రోజులు అయిపోతున్నా కూడా ఇంకా ప్రేమకథ సినిమాల ద్వారానే అయన అలరించాడు.
Photo Credit :
Pinkvilla
హీరో రామ్ పోతినేని (Ram Pothineni)
అయితే ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) సినిమా భారీ విజయాన్ని అందుకుందో అప్పటి నుంచి తన ఆలోచన ను తాను పూర్తిగా మార్చివేశాడు. ప్రస్తుతం మాత్రం ఎక్కువ శాతం మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న సినిమాల వైపే ఫోకస్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
Photo Credit :
Pinkvilla
హీరో రామ్ పోతినేని (Ram Pothineni)
ఆ మూవీ తో ఫుల్ మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న రామ్ ఇప్పుడు ‘ది వారియర్’ (The Warrior) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా లింగుసామి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. తన కెరీర్లోనే తొలిసారిగా రామ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు.
Photo Credit :
Pinkvilla
హీరో రామ్ పోతినేని (Ram Pothineni)
ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఇప్పటికే ది వారియర్ మూవీ లో మాస్ హీరోగా కనిపించడానికి రెడీ అవుతున్న రామ్ పోతినేని ఈ సినిమా తర్వాత టాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో నటించబోతున్నాడు. ఇప్పటి వరకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ యాక్షన్ సన్నివేశాలకు సన్నివేశాలకు ఎలాంటి కొదవ ఉండదు.
Photo Credit :
Pinkvilla
హీరో రామ్ పోతినేని (Ram Pothineni)
ఇక, ఈ సినిమాలో రష్మిక మందన (Rashmika Mandanna) కథానాయికగా నటించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నగా ఈ సినిమా ద్వారా తనలోని సరికొత్త మాస్ కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారు మరి ఈ విధంగా వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న రామ్ పోతినేని ఏ స్థాయిలో తన కెరియర్ను బిల్డ్ చేసుకుంటాడో చూడాలి.
Photo Credit :
Pinkvilla
Follow Us