కృతి శెట్టి (Krithi Shetty)
టాలీవుడ్ లో తాను చేసిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది కృతి శెట్టి (Krithi Shetty). 'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. ప్రస్తుతం కృతి శెట్టి యంగ్ హీరో రామ్ పోతినేనితో 'ది వారియర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ది వారియర్' సినిమా ప్రమోషన్లలో భాగంగా కృతి శెట్టి.. రామ్‌పై చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.
Photo Credit :
Pinkvilla
కృతి శెట్టి (Krithi Shetty)
తమిళ దర్శకుడు లింగుస్వామి (Director Lingu Samy) దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో 'ది వారియర్' సినిమా రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది కృతి శెట్టి.
Photo Credit :
Pinkvilla
కృతి శెట్టి (Krithi Shetty)
లింగుసామి 'ది వారియర్' (The Warrior Movie) సినిమా కోసం తనకు ఫోన్ చేశారని.. అప్పుడు తాను ఎంతో ఆనందించానని చెబుతూ ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. రామ్‌తో కలిసి పనిచేయడంపై కృతి శెట్టి తన అనుభవాలని చెప్పుకొచ్చింది. 'రామ్‌తో కలిసి నటించగలను కానీ.. డ్యాన్స్ వేసేటప్పుడు మాత్రం కష్టంగా ఉంటుంది. స్టెప్పులు వేసేటప్పుడు రామ్ స్పీడును అందుకోవడం నాకు పెద్ద టాస్క్' అని ఆమె అభిప్రాయపడింది.
Photo Credit :
Pinkvilla
కృతి శెట్టి (Krithi Shetty)
ఈ ఏడాది నాలుగు సినిమాల్లో నటించడం ఎలా ఉందనే ప్రశ్నకు.. ‘బంగార్రాజు’ (Bangarraju Movie), ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి వెను వెంటనే రిలీజ్ అయ్యాయి. వాటితో చూస్తే ‘ది వారియర్’ సినిమా కాస్త ఆలస్యంగా తెరపైకి వస్తోంది. దీంతో గ్యాప్ వచ్చిందనే ఫీలింగ్ కలుగుతోందని తెలిపింది. ఈ సినిమాలలో తన పాత్ర గురించి వివరిస్తూ.. "విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. తనొక రేడియో జాకీ. ఈ క్యారెక్టర్ వింటున్నప్పుడు మంచి ఫీలింగ్ కలిగింది. ప్రేక్షకులూ అదే అనుభూతి చెందుతారు. సినిమా చూస్తున్నంత సేపు పక్కింటి అమ్మాయిలా అనిపిస్తాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో ఇది భిన్నమైనది. ఇంకొంచెం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఆమె మాటలకే విజిల్ వేస్తారు. దర్శకుడు లింగుస్వామి ఎలా నటించాలో వివరంగా చెబుతారు. దాంతో నటించడం సులువైంది" అని పేర్కొంది.
Photo Credit :
Pinkvilla
Follow Us