రాశీ ఖన్నా (Raashi Khanna)
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థాంక్యూ’ (Thank You). విక్రమ్‌కుమార్ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. రాశీఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. కాగా, ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది.
Photo Credit :
Pinkvilla
రాశీ ఖన్నా (Raashi Khanna)
ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంఛ్ (Thank You Trailer Launch) కార్యక్రమం మంగళవారం అక్కినేని అభిమానులు, చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర హీరోహీరోయిన్లతో పాటు మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.
Photo Credit :
Pinkvilla
నాగ చైతన్య (Naga Chaitanya)
అయితే థాంక్యూ మూవీ డైరెక్టర్ విక్రమ్‌కుమార్ షార్ట్ వేసుకొని ట్రైలర్ రిలీజ్ వేడుకకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక, హీరో నాగ చైతన్య (Naga Chaitanya) ఈవెంట్‌కు చాలా స్టైలిష్‌గా వచ్చాడు.
Photo Credit :
Pinkvilla
నాగ చైతన్య (Naga Chaitanya)
ఇక చైతు రాగానే.. అక్కడున్న ఫ్యాన్స్ అంతా ఈలలు వేస్తూ గోలలు చుశారు. ఆ తర్వాత రాశీ ఖన్నా (Raashi Khanna) కూడా చాలా స్టైలిష్ డ్రెస్‌లో వచ్చింది. ఆమె వేసుకున్న డ్రెస్ కూడా చాలా నీట్‌గా ఉంది.
Photo Credit :
Pinkvilla
Follow Us