'థాంక్యూ' మూవీ ప్రమోషన్స్ లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)
Naga Chaitanya: అక్కినేని నట వారసుడు నాగచైతన్య ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. సమంతతో విడిపోయిన తర్వాత నుంచి కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ సాధించాడు. 'థాంక్యూ' సినిమాతో మూడో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు చైతూ. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు.
Photo Credit :
Pinkvilla
'థాంక్యూ' మూవీ ప్రమోషన్స్ లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న 'థాంక్యూ' మూవీలో.. రాశీ ఖన్నా (Raashi Khanna), అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 22న ఈ సినిమా బిగ్ స్క్రీన్లపై సందడి చేసేందుకు రెడీగా ఉంది.
Photo Credit :
Pinkvilla
'థాంక్యూ' మూవీ ప్రమోషన్స్ లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)
తాజాగా నాగ చైతన్య 'థాంక్యూ' (Thankyou Movie) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి బయటపెట్టాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. 'నా ఫస్ట్‌లవ్ తొమ్మిదో తరగతిలో జరిగింది. నేను ఇంకో ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించాము. కానీ ఆ అమ్మాయి మా ముగ్గురి లవ్ ని బ్రేక్ చేసి వెళ్ళిపోయింది. దీంతో లవ్ పోయినా ఆ తర్వాత మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాము' అని తెలిపాడు.
Photo Credit :
Pinkvilla
'థాంక్యూ' మూవీ ప్రమోషన్స్ లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)
ఇదిలా ఉంటే.. ఇప్పటికే 'థాంక్యూ' సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తీసుకొచ్చింది. ఈ చిత్ర ట్రైలర్, టీజర్ చూస్తే ఇది ఫీల్ గుడ్ సినిమా మాదిరిగా అనిపిస్తోంది. కాగా, నాగచైతన్య ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో అమీర్ ఖాన్ (Aamir Khan) తో పాటు 'లాల్ సింగ్ చడ్ఢా'తో రాబోతున్నాడు. ఆ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Photo Credit :
Pinkvilla
Follow Us