'సీతారామం' ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందన్నా, దుల్కర్ సల్మాన్ (Rashmika Mandanna, Dulquer Salman)
దుల్కర్ సల్మాన్ హీరోగా, టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీతారామం’ (Sitaramam). ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో దుల్కర్ (Dulquer Salman) సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తుండగా.. మరో ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న నటించింది. 1964 కాలానికి ప్రస్తుత సమయాన్ని ముడిపెడుతూ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు.
Photo Credit :
pinkvilla
'సీతారామం' ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందన్నా, దుల్కర్ సల్మాన్ (Rashmika Mandanna, Dulquer Salman)
ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తరుణ్ భాస్కర్, సుమంత్, భూమిక కీలక పాత్రలు పోషించారు. కాశ్మీర్ కొండల్లోని ఒంటరి సైనికుడు లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్, అతడిని ప్రేమించే యువతి సీతామహాలక్ష్మి క్యారెక్టర్లో మృణాళ్ ఠాకూర్ నటించారు. కాశ్మీర్‌కు చెందిన ముస్లిం అమ్మాయి అఫ్రీన్‌గా రష్మిక కనిపించనున్నారు. కొద్ది నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న సీతారామం సినిమా ఆగస్టు 5న తెలుగు, మలయాళంతో పాటు పలు భాషల్లో రిలీజ్ కానుంది.
Photo Credit :
pinkvilla
'సీతారామం' ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందన్నా, దుల్కర్ సల్మాన్ (Rashmika Mandanna, Dulquer Salman)
ఇక, ‘సీతారామం’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన వివిధ పాత్రల లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ లాంఛ్ (Sitaramam Traielr Launch Event) కార్యక్రమం చిత్రయూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ హను రాఘవపూడి `సీతారామం`లోని రష్మిక క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు భయపడిపోయి.. నో చెప్పానని అన్నారు. అయినా ఆమెను వదలకుండా అదే క్యారెక్టర్ చేయించారట డైరెక్టర్.
Photo Credit :
pinkvilla
'సీతారామం' ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందన్నా, దుల్కర్ సల్మాన్ (Rashmika Mandanna, Dulquer Salman)
ఈ కార్యక్రమంలో హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) మాట్లాడుతూ.. "అభిమానులందరూ రొమాంటిక్ హీరో, రొమాంటిక్ హీరో అని పిలుస్తుంటే.. విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని నిర్ణయించుకున్నా. అలాంటి సమయంలో హనుగారు ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తిండి పోయే ఎపిక్ సినిమా. ఇలాంటి కథని ఎట్టిపరిస్థితిల్లో వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. నా చివరి ప్రేమకథగా ‘సీతా రామం’ వంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని ఫిక్సయ్యా" అని తెలిపారు.
Photo Credit :
pinkvilla
Follow Us