'సీతారామం' ప్రమోషన్స్ లో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman)
టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతా రామం’ (Sitaramam). దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
Photo Credit :
pinkvilla
'సీతారామం' ప్రమోషన్స్ లో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman)
ఈ చిత్రంలో దుల్కర్ (Dulquer Salman) సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తుండగా.. మరో ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న నటించింది. 1964 కాలానికి ప్రస్తుత సమయాన్ని ముడిపెడుతూ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు.
Photo Credit :
pinkvilla
'సీతారామం' ప్రమోషన్స్ లో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman)
ఇక, ‘సీతారామం’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన వివిధ పాత్రల లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ లాంఛ్ (Sitaramam Traielr Launch Event) కార్యక్రమం చిత్రయూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ హను రాఘవపూడి `సీతారామం`లోని రష్మిక క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు భయపడిపోయి.. నో చెప్పానని అన్నారు. అయినా ఆమెను వదలకుండా అదే క్యారెక్టర్ చేయించారట డైరెక్టర్.
Photo Credit :
pinkvilla
'సీతారామం' ప్రమోషన్స్ లో రష్మిక మందన్నా (Rashmika Mandann)
‘హను (Hanu Raghavapudi) తనకు అఫ్రీన్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ముందు భయం వేసింది, నేను చేయలేనని చెప్పాను. ఇప్పటివరకు నేను బబ్లీ క్యారెక్టర్స్, యాంగ్రీ బర్డ్ క్యారెక్టర్స్ చేశాను. అయితే ఇంత రెబల్‌గా, క్రూరమైన పాత్ర చేస్తే ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారా అని భయపడ్డాను. కానీ, పూర్తి కథ, తన క్యారెక్టర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పడం, నేను చేయగలను అనే ధైర్యం దర్శకుడు హను ఇవ్వడంతో కొంత హార్డ్ వర్క్ చేసి ఫైనల్‌గా ఓకే చెప్పాను. ఈ సినిమా, అందులోని క్యారెక్టర్లు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి’ అంటూ చెప్పుకొచ్చారు రష్మిక (Rashmika Mandanna).
Photo Credit :
pinkvilla
'సీతారామం' ప్రమోషన్స్ లో రష్మిక మందన్నా (Rashmika Mandanna)
ఈ కార్యక్రమంలో హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) మాట్లాడుతూ.. "అభిమానులందరూ రొమాంటిక్ హీరో, రొమాంటిక్ హీరో అని పిలుస్తుంటే.. విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని నిర్ణయించుకున్నా. అలాంటి సమయంలో హనుగారు ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తిండి పోయే ఎపిక్ సినిమా. ఇలాంటి కథని ఎట్టిపరిస్థితిల్లో వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. నా చివరి ప్రేమకథగా ‘సీతా రామం’ వంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని ఫిక్సయ్యా" అని తెలిపారు.
Photo Credit :
pinkvilla
Follow Us