రష్మిక మందన్నా(Rashmika Mandanna)
Rashmika Mandanna: టాలీవుడ్ శ్రీవల్లి.. రష్మిక మందన్నా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. తెలుగులో వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాతో దేశం మొత్తం పాపులర్ అయిపోయింది ఈ బ్యూటీ. 'గీతగోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'పుష్ప ది రైజ్' చిత్రాలతో రష్మిక రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం పారితోషికంలోనూ చుక్కలు చూపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే ఉత్సాహంలో ఫిట్ నెస్ గోల్స్ ని ఫిక్స్ చేసుకుని రూపురేఖల్ని మరింత ట్రిమ్ చేసేస్తోంది.
Photo Credit :
Pinkvilla
రష్మిక మందన్నా(Rashmika Mandanna)
నేటితరం నాయికలకు ఫిట్ నెస్ తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. అందుకే నిరంతరం ఫిట్ నెస్ గోల్స్ ని ఫిక్స్ చేసుకుని జిమ్ముల్లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. టాలీవుడ్ నాయికల్లో ఫిట్ నెస్ అనగానే.. వెంటనే సమంత (Samantha), రకుల్ ప్రీత్ వంటి స్టార్ హీరోయిన్లు గుర్తుకొస్తారు. ఆ ఇద్దరు ఫిట్ నెస్ ఫ్రీక్స్ గా పాపులర్. ఈ లిస్ట్ లో రష్మిక మందన్నా పేరు కూడా చేరిపోయింది. సీనియర్ల బాటలోనే రష్మిక మందన పయనిస్తోంది.
Photo Credit :
Pinkvilla
రష్మిక మందన్నా(Rashmika Mandanna)
అందుకే ఇలా ఫిట్ నెస్ పైనే ప్రత్యేకంగా శ్రద్ద పెట్టిందట రష్మిక (Rashmika Mandanna). నిరంతరం జిమ్ములో స్వేదం చిందిస్తూ సమంత.. రకుల్ కి తక్కువేం కాదని ప్రూవ్ చేస్తోంది ఈ బ్యూటీ.
Photo Credit :
Pinkvilla
రష్మిక మందన్నా(Rashmika Mandanna)
ఇక, రష్మిక సినిమాల విషయానికి వస్తే 'పుష్ప దిరూల్' లో (Pushpa Movie) నటిస్తోంది. బాలీవుడ్ లో 'మిషన్ మజ్ను'.. 'గుడ్ బై' చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సందీప్ రెడ్డి వంగ కొత్త ప్రాజెక్ట్ 'యానిమల్'లోనూ అవకాశం అందుకుంది. ఇందులో రాక్ స్టార్ రణబీర్ కపూర్ సరసన నటిస్తుంది. ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు లైనప్ లో ఉన్నట్లు సమాచారం.
Photo Credit :
Pinkvilla
Follow Us