Chiranjeevi's God Father Review Live Updates : గాడ్ ఫాదర్ చిత్రం లైవ్ అప్డేట్స్ మీకోసం !

బాక్సాఫీస్ రిపోర్ట్

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందని, ప్రముఖ సినీ క్రిటిక్ రమేష్ బాల తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రేక్షకులకు తన అభిప్రాయాన్ని తెలిపారు. 

చిరంజీవి తండ్రిగా సర్వదమన్ బెనర్జీ

"సిరివెన్నెల" సినిమాలో హీరోగా నటించిన సర్వదమన్ బెనర్జీ ఈ సినిమాలో చిరంజీవికి తండ్రిగా నటించారు. నిజాయతీ గల ముఖ్యమంత్రి పాత్రలో తన పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. 
 

సల్మాన్ ఖాన్ ఎంట్రీ

ఈ సినిమా బాలీవుడ్‌లో కూడా విడుదల అవుతంది కాబట్టి, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కి ఓ స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చారు. "గాడ్ ఫాదర్"  బ్రహ్మకి సహాయపడే మసూమ్ ఖాన్ పాత్రలో సల్మాన్ ఫ్యాన్స్‌ను అలరించారు. ఈయన మీద సినిమాలో ఉన్నవి కేవలం రెండే యాక్షన్ సీక్వెన్సెస్. అలాగే "తార్ మార్ తక్కర్ మార్" పాటలో సల్మాన్, చిరుతో కలిసి స్టెప్పులేశారు. 

చిరంజీవి చెల్లెలి పాత్రలో నయనతార

నయనతార.. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు సత్యప్రియ పాత్రలో అలరించారు. తన అన్నను తప్పుగా అర్థం చేసుకొని, తనకు వ్యతిరేకంగా వెళ్లే ఈ పాత్ర తర్వాత పాజిటివ్‌గా మారి, సినిమాకి బలాన్ని చేకూరుస్తుంది.

విలన్ పాత్రలో సత్యదేవ్ జీవించేశాడనే చెప్పాలి

విలన్ జయదేవ్ పాత్రలో సత్యదేవ్ నటన ఆకట్టుకొనే విధంగా ఉంది. నయనతార భర్తగా, తమ పార్టీకి ఫండింగ్ కోసం డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపే అవినీతిపరుడిగా ఆయన యాక్టింగ్ సినిమాకి మరో ప్లస్ పాయింట్.

నజభజజజర సాంగ్‌లో చిరంజీవి ఎలివేషన్ అదుర్స్

ఒక పొలిటికల్ గేమ్‌లో తనదైన శైలిలో పావులు కదిపిన బ్రహ్మ పాత్రలో చిరంజీవి ఎంట్రీ ప్రేక్షకులను అలరిస్తుండగా, బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే నజభజజజర సాంగ్ ఆ యాక్షన్ సీన్‌కు మంచి బలాన్ని చేకూర్చింది. 

జర్నలిస్టు పాత్రలో పూరీ జగన్నాథ్

ఈ సినిమాలో తొలిసారిగా ఓ జర్నలిస్టు పాత్రలో పూరీ జగన్నాథ్ కనిపించారు. ఈ పాత్రలో ఆయన తన పరిధి మేరకు బాగా రాణించారు. అమెరికాలోని "గాడ్ ఫాదర్" మొదటి షో ఉదయం 1.00 గంటలకే ప్రదర్శితమైంది. 

"బ్రహ్మ" పాత్రలో అదరగొట్టిన చిరంజీవి

ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర పేరు "బ్రహ్మ". ఆ పాత్రను స్టైలిష్‌గా, పవర్ ఫుల్‌గా, వైవిధ్యంగా దర్శకులు తెరకెక్కించారు. ఈ పాత్రకు దీటుగా నయనతార, సత్యదేవ్ పాత్రలు ఉంటాయి. 

అభిమానులకు భారీ అంచనాలు

మోహన్ రాజా దర్శకత్వం వహించిన "గాడ్ ఫాదర్" చిత్రం ఈ రోజే విడుదలైంది. కొన్ని ప్రాంతాలలో ఉదయం 6 గంటలకే మార్నింగ్ షోను ప్రదర్శించడం జరిగింది. తమిళ చిత్రం "లూసిఫర్" ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనేక మార్పులు చేసి, చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్ చిత్రంగా డైరెక్టర్ తెరకెక్కించారు.