మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)
ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ (Indian Idol Telugu Reality show) సింగింగ్ రియాలిటీ షో తుది అంకానికి చేరుకుంది. ఫినాలే ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా రాబోతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో భాగంగా తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఈ కార్యక్రమ గ్రాండ్ ఫినాలేకి విరాటపర్వం చిత్రబృందం కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
Photo Credit :
Pinkvilla
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)
ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు చేసి ఈ ఎపిసోడ్ షూట్ చేశారట. ఆయన చేతుల మీదుగానే ఇండియన్ ఐడల్ తెలుగు విన్నర్‌కి ట్రోఫీ అందించనున్నారు. తెలుగులో ఇదే తొలి ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం కావడంతో విన్నర్ ఎవరవుతారనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ ఫినాలేలో చిరంజీవి (chiranjeevi), సాయి పల్లవి సందడి చేస్తారని తెలియడం మరింత ఆత్రుత పెంచేసింది. ఈ ఎపిసోడ్ జూన్ 17న ఆహాలో ప్రసారం కానుంది.
Photo Credit :
Pinkvilla
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)
కాగా, దేశవ్యాప్తంగా ఈ షో ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ సోనీ ఛానల్లో ప్రసారం అయ్యే ఈ షోకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది సింగర్స్ ఈ కార్యక్రమంలో పాల్గోని టైటిల్ విన్నర్స్‌గా నిలిచారు. అదే బాటలో తెలుగులో మొదటిసారిగా అది కూడా ఆహా ఓటీటీ వేదికగా ఇండియన్ ఐడల్ తెలుగు (Indian Idol Telugu) అంటూ ప్రసారం అవుతోంది. ఓటీటీ వేదికగా సాగిపోతున్న ఈ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. అదేవిధంగా తెలుగు కొత్త సింగర్స్ ప్రపంచానికి పరిచయం అవుతున్నారు.
Photo Credit :
Pinkvilla
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)
అయితే, కరోనా పుణ్యమా అని థియేటర్లు మూత పడటంతో ప్రేక్షకులను సందడి చేయడం కోసం ఓటీటీ (Aha ott) సంస్థలు పుట్టుకొచ్చాయి. అప్పటివరకు పెద్దగా ఆదరణ లేకపోయినా ఓటీటీ సంస్థలకు ఒక్కసారిగా ఎంతో పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులను సందడి చేయడం కోసం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆహా ద్వారా వెబ్ సిరీస్, సినిమాలు, టాక్ షోలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.
Photo Credit :
Pinkvilla
Follow Us