సాయి పల్లవి (Sai Pallavi)
Sai Pallavi: దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్ లో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి, రానా జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. ఈ సినిమాలో సాయి పల్లవి.. అభ్యుదయవాది సరళ పాత్రను పోషించింది. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ సరళ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కలిసింది.
Photo Credit :
Pinkvilla
సాయి పల్లవి (Sai Pallavi)
అందంతో పాటు అభినయంతోనూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుందీ భామ. ఇటీవలే శ్యామ్సింగరాయ్తో (Shyamsingharoy) హిట్టు కొట్టింది. త్వరలోనే విరాట పర్వంతో ప్రేక్షకులను పలకరించనుంది. జూన్ 17న విరాట పర్వం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
Photo Credit :
Pinkvilla
సాయి పల్లవి (Sai Pallavi)
ఎక్సోపోజింగ్కు దూరంగా ఉంటూ స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందిన ఆమె తాజాగా స్కిన్ షోపై (Skin Show) స్పందించింది. ఈ తాజా ఇంటర్య్వూలో పొట్టి బట్టలు వేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అలాంటి అవుట్ ఫిట్లో కంఫర్ట్ ఉండనని చెప్పింది. అయితే దానికి కారణమేంటో కూడా ఈ సందర్భంగా సాయి పల్లవి వెల్లడించింది. ‘డాక్టర్ కోర్స్లో భాగంగా నేను జార్జీయా వెళ్లాను. ఆ సమయంలో టాంగో డాన్స్ నేర్చుకున్నాను. అయితే ఓ ఈవెంట్లో నేను టాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ డాన్స్ చేయాలంటే అందుకు అనుకూలంగా ఉండే కాస్ట్యూమ్స్ వేసుకోవాలి’ అని పేర్కొంది.
Photo Credit :
Pinkvilla
సాయి పల్లవి (Sai Pallavi)
ఇక, వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయి పల్లవి ఈ మధ్య సడన్ గా సినిమాలు తగ్గించారు. కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయడం ఆపేశారు. దీంతో ఆమె ప్రేమలో పడ్డారని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. టాలీవుడ్ (Tollywood) కి చెందిన యంగ్ హీరో ప్రేమలో పడ్డారట. అతన్నే వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. అయితే తాజాగా ఈ విషయంపై సాయి పల్లవి స్పందించారు. తెలుగు అబ్బాయినే చేసుకుంటారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె సెటైరికల్ గా స్పందించారు. నేను పెళ్లి చేసుకునే తెలుగు అబ్బాయి ఇంకా పుట్టలేదేమో అంటూ సమాధానం చెప్పారు.
Photo Credit :
Pinkvilla
Follow Us